Ease of Doing Business Index: డూయింగ్‌ బిజినెస్‌ నివేదిక నిలిపివేత: ప్రపంచ బ్యాంకు

వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులకు సంబంధించి విడుదల చేసే ’ఈజ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ నివేదికను నిలిపివేయాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది. చైనాతో పాటు కొన్ని దేశాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇందుకు కారణం. 2018, 2020 నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి ఆరోపణలపై అంతర్గతంగా విచారణ నిర్వహించిన నేపథ్యంలో డూయింగ్‌ బిజినెస్‌ నివేదికను నిలిపివేయనున్నట్లు ప్రపంచ బ్యాంకు సెప్టెంబర్‌ 17న వెల్లడించింది. అప్పట్లో వరల్డ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ జిమ్‌ యోంగ్‌ కిమ్, సీఈవో క్రిస్టలీనా జార్జియేవా ఒత్తిడి మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్‌ లభించేలా వరల్డ్‌ బ్యాంక్‌ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయసేవల సంస్థ విల్మర్‌హేల్‌ నిర్ధారించింది.

చ‌ద‌వండి: మొత్తం ఎన్ని రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్‌ వర్తింపజేయనున్నారు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఈజ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నివేదిక నిలిపివేత
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 17
ఎవరు    : ప్రపంచ బ్యాంకు 
ఎందుకు  : చైనాతో పాటు కొన్ని దేశాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరగడంతో...

#Tags