S&P Global Ratings: ఎస్‌అండ్‌పీ గ్లోబల్ అంచనా ప్ర‌కారం భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతంటే..

రేటింగ్ దిగ్గజం ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో 6.8 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాలను యథాతథంగా కొనసాగిస్తోంది.

➤ 2023–24లో భారతదేశం 8.2 శాతం వృద్ధి రేటు సాధించిందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ప్రశంసించింది.
➤ 2024–25లో భారతదేశం 6.8 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది.
➤ 2025–26, 2026–27లో భారతదేశం వృద్ధి రేట్లు వరుసగా 6.9 శాతం, 7 శాతాలుగా ఉంటాయని అంచనా వేసింది.
➤ 2024లో చైనా వృద్ధి రేటు 4.6 శాతం నుండి 4.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.
➤ రెండో త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) చైనా ఎకానమీ మందగమనాన్ని చూస్తుందని అంచనా వేసింది.
➤ అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యలోటు సవాళ్లు డిమాండ్‌ను తగ్గిస్తాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ పేర్కొంది.

India GDP Growth: అంచనాలకు మించి.. భారత్ వృద్ధి!!

#Tags