RBI: డీ–ఎస్‌ఐబీలుగా కొనసాగనున్న బ్యాంకులు?
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ప్రైవేటు రంగంలో బ్యాంకింగ్ దిగ్గజాలు– ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక బ్యాంకులు (డీ–ఎస్‌ఐబీలు) లేదా సంస్థలుగా కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ మేరకు జనవరి 4న ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రత్యేకత ఏమిటి?
డీ–ఎస్‌ఐబీలను ‘టూ బిగ్ టూ ఫెయిల్ (టీబీటీఎఫ్)లుగా పరిగణిస్తారు. ఈ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి దాదాపు ఉండబోదన్నది దీని ఉద్దేశ్యం. ఒకవేళ ఈ పరిస్థితి ఎదురైనా, దీనిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఆయా అంశాల వల్ల ఈ బ్యాంకులు మార్కెట్ నుంచి నిధుల సమీకరణలో నిర్దిష్ట సాను కూలతలు, ప్రయోజనాలను పొందగలుగుతాయి.
మరికొన్ని ముఖ్యాంశాలు..
- డీ–ఎస్‌ఐబీ నిర్ధారణ ఫ్రేమ్‌వర్క్ 2014 జూలైలో జారీ అయ్యింది. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద సేకరించిన వ్యాపార గణాంకాల ప్రాతిపదికన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు 2015, 2016ల్లో ఆర్‌బీఐ డీ–ఎస్‌ఐబీ హోదా ఇచ్చింది. 2017 మార్చి 31న హెచ్‌డీఎఫ్‌సీకి కూడా ఇదే హోదా లభించింది.
- డీ–ఎస్‌ఐబీల కోసం అదనపు కామన్ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) సౌలభ్యతను ఏప్రిల్ 1, 2016 నుండి దశలవారీగా ప్రారంభించడం జరిగింది. 2019 ఏప్రిల్ 1 నుండి పూర్తిగా అమలులోకి వచ్చింది. తగిన మూలధన కల్పనలో ఈ సౌలభ్యత కీలకమైనది.
చదవండి: స్టెర్లింగ్ విల్సన్ కొత్త ప్రమోటర్‌గా ఆవిర్భవించిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక బ్యాంకులు (డీ–ఎస్‌ఐబీలు) లేదా సంస్థలుగా కొనసాగుతాయి
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : ఈ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి దాదాపు ఉండబోదని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్