Global House Price Index 2021: ఇళ్ల రేట్లలో భారత్‌కు ఎన్నో ర్యాంకు లభించింది?

Global House Price Index - Q3 2021: 2021, అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో భారత్‌లో గృహాల ధరలు 2.1 శాతం మేర పెరిగాయి. దీంతో అంతర్జాతీయంగా గృహాల ధరల పెరుగుదలకు సంబంధించిన జాబితాలో భారత్‌ 56వ ర్యాంకు నుంచి 51వ స్థానానికి ఎగబాకింది. ’గ్లోబల్‌ హౌస్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ – క్యూ4 2021’ నివేదికలో నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. అధికారిక గణాంకాల ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలు, ప్రాంతాల్లో ఇళ్ల ధరల వివరాలను క్రోడీకరించి నైట్‌ ఫ్రాంక్‌ ఈ నివేదిక రూపొందించింది. 2020 క్యూ4లో భారత్‌ 56వ ర్యాంకులో ఉన్న విషయం విదితమే.

PLFS: ఎన్‌ఎస్‌వో సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు?

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • వార్షిక ప్రాతిపదికన టర్కీలో గృహాల రేట్లు అత్యధికంగా 59.6 శాతం మేర పెరిగాయి. న్యూజిలాండ్‌ (22.6 శాతం), చెక్‌ రిపబ్లిక్‌ (22.1 శాతం), స్లొవేకియా (22.1 శాతం), ఆస్ట్రేలియా (21.8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
  • ఇక మలేషియా, మాల్టా, మొరాకో మార్కెట్లలో హౌసింగ్‌ ధరలు 0.7–6.3 శాతం మేర తగ్గాయి.
  • డేటా ప్రకారం 56 దేశాలు, ప్రాంతాల్లో రేట్లు సగటున 10.3 శాతం మేర పెరిగాయి.
  • అంతర్జాతీయంగా ప్రభుత్వాల విధానపరమైన చర్యల తోడ్పాటు తదితర అంశాలతో హౌసింగ్‌ ధరలు మెరుగుపడ్డాయి.

GDP Growth Rate: ఎస్‌అండ్‌పీ అంచనా ప్రకారం.. 2022–23లో భారత్‌ వృద్ధి రేటు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయంగా గృహాల ధరల పెరుగుదలకు సంబంధించిన జాబితాలో భారత్‌ 51వ ర్యాంకు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు    : నైట్‌ ఫ్రాంక్‌ విడుదల చేసిన గ్లోబల్‌ హౌస్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ – క్యూ4 2021 
ఎక్కడ    : ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలు, ప్రాంతాల్లో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags