Daily Current Affairs in Telugu: 01 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
december Daily Current Affairs in Telugu

1. చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డులకెక్కనుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ)  నివేదించింది.

2. మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వీర రాణా నియమితులయ్యారు.

Daily Current Affairs in Telugu: 29 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. రూ.2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌(డీఏసీ) ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. 

4. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి నిరుద్యోగిత రేటు 6.6 శాతానికి తగ్గింది.

5. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అక్టోబర్‌తో ముగిసిన నెలకు ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో 45 శాతానికి చేరింది.  

Daily Current Affairs in Telugu: 28 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

6. భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) అంచనాలను మించి 7.6 శాతంగా నమోదయ్యింది.

7. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని దుబాయి నగరంలో జ‌రిగిన‌ కాప్‌–28 సదస్సులో వాతావరణ మార్పుల వల్ల న‌ష్ట‌పోతున్న‌ పేద దేశాలకు   పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కాప్‌–28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు.

8. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం  కేంద్రాన్ని కోరుతూ క్యాబినెట్‌లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

Daily Current Affairs in Telugu: 24 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags