03 October Daily Current Affairs in Telugu: 03 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
03 October Daily Current Affairs in Telugu

1. ఆసియా క్రీడల్లో వుమెన్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 3000మీ.లో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్‌, హీరాల్ సధూ, ఆరతి కస్తూరిభారత్‌కు కాంస్య పతకం అందించారు. మెన్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 3000మీ. రిలే టీమ్‌ ఈవెంట్లో  ఆర్యన్‌ పాల్‌, ఆనంద్‌ కుమార్‌, సిద్ధాంత్‌, విక్రమ్‌ కలిసి భారత్‌కు కాంస్య పతకం అందించారు.

2. ఆసియా క్రీడల మహిళల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో కాంస్య పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా సుతీర్థ–అహిక ముఖర్జీ ద్వయం గుర్తింపు పొందింది.

02 October Daily Current Affairs in Telugu: 02 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఆసియా క్రీడల్లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో  పారుల్‌ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. 

4. ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్‌జంప్‌లో  ఆన్సీ సోజన్‌ ఇడపిలి రజత పతకం సాధించింది.

30 September Daily Current Affairs in Telugu: 30 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

5. ఆసియా క్రీడల్లో 4*400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో  అజ్మల్, విత్యా రామ్‌రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు  మూడో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది.

6. భౌతిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం 2023 సంవత్సరానికిగాను అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్‌ క్రౌజ్‌, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌ హ్యులియర్‌ను వరించింది.

29 September Daily Current Affairs in Telugu: 29 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags