India China Ties: భార‌త్‌, చైనా ర‌క్ష‌ణ మంత్రుల భేటీ

ఆసియాన్ ప్రాంతీయ భద్రతా సదస్సులో భాగంగా వియత్నాం రాజధాని లావోస్‌లో భారతదేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్‌లు న‌వంబ‌ర్ 20వ తేదీ భేటీ అయ్యారు.

2020లో తూర్పు లద్దాఖ్‌లో ఇరు సైన్యాల ఘర్షణలు, ఉద్రిక్తతల తర్వాత సన్నగిల్లిన పరస్పర నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని ఇరు దేశాల రక్షణ మంత్రులు నిర్ణయించారు. 

తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాల సైనికులు వేలాదిగా మొహరించి నెలల తరబడి ఉద్రిక్తతలు కొనసాగి ఇటీవల సైనికుల ఉపసంహరణ మొదలైన వేళ జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పరస్పర విశ్వాసం, నమ్మకం పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

"భారత్, చైనా చిరకాలం పొరుగుదేశాలుగా మసులుకోవాల్సిందే. అందుకే పొరుగుదేశాల మధ్య ఘర్షణ కంటే గణనీయ సహకారం ప్రధానం. బలగాల ఉపసంహరణతో పరస్పర నమ్మకం పాదుకొల్పుదాం" అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.

India-China: భారత్‌-చైనాల మధ్య విమానాల రాకపోకలు పునఃప్రారంభం

#Tags