Asia-Pacific Conference: ఢిల్లీలో ‘ఆసియా–పసిఫిక్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ జర్మన్‌ బిజినెస్‌’ సదస్సు

‘18వ ఆసియా–పసిఫిక్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ జర్మన్‌ బిజినెస్‌–2024’ సదస్సు అక్టోబర్ 25వ తేదీన ఢిల్లీలో జరిగింది.

ఈ స‌ద‌స్సులో నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్‌లర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌తోపాటు భారత్, జర్మనీ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సు జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్‌ దేశీ పెట్టుబడుల పరంగా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని, విదేశీ వ్యాపారవేత్తలను పెట్టుబడులకు ఆహ్వానించారు. “మేక్‌ ఇన్‌ ఇండియా”, “మేక్‌ ఫర్‌ ద వరల్డ్‌” కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని కోరారు. భారత్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, పెట్టుబడులకు మెరుగైన దేశం లేదు అని చెప్పారు.

BRICS Summit 2024: రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సు.. దీని ముఖ్యాంశాలు ఇవే..

మోదీ, నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులపై జర్మనీ ఆసక్తి చూపుతోందని, వారికి వీసాల సంఖ్యను పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. “ఫోకస్‌ ఆన్‌ ఇండియా” డాక్యుమెంట్‌ను జర్మనీ కేబినెట్ విడుదల చేసింది, ఇది రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

శాంతి స్థాపనకు సహకరిస్తాం  
ఏడో ఇంటర్‌–గవర్నమెంటల్‌ కన్సల్టేషన్స్‌(ఐజీసీ)లో భాగంగా మోదీ ఢిల్లీలో జర్మనీ చాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌తో సమావేశమయ్యారు. భారత్‌–జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. 
మోదీ మాట్లాడుతూ.. శాంతి స్థాపనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, ఉక్రెయిన్ మరియు పశ్చిమాసియాలోని సంఘర్షణలపై చర్చించారు. “యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లభించ‌దని, చర్చలు, దౌత్యమార్గాల్లో ప్రయత్నించాలి” అని తెలిపారు.  

Modi-Xi Jinping Bilateral: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక భేటీ

#Tags