Best Bank in India: భారత్‌లో బెస్ట్ బ్యాంక్‌గా 'ఎస్‌బీఐ'

ప్రభుత్వ రంగ బ్యాంక్ 'ఎస్‌బీఐ' (SBI) 'భారతదేశంలో అత్యుత్తమ బ్యాంక్'గా గుర్తింపు పొందింది.

అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 'బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా'గా ఎంపిక చేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ సమావేశంలో భాగంగా.. వాషింగ్టన్ డీసీలో జరిగిన 31వ యానివెర్సరీ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్‌ ప్రధానోత్సవం జరిగింది. ఈ సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్సీ ఎస్ సెట్టి ఈ అవార్డును స్వీకరించారు.

అత్యుత్తమ సేవలు అందిస్తూ, అందరికీ బ్యాంకింగ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నందుకు గాను 'బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా' పురస్కారం లభించిందని ఎస్‌బీఐ తెలిపింది.

22,500 పైగా శాఖలు.. 62,000 కంటే ఎక్కువ ఏటీఎంలతో విస్తృత నెట్‌వర్క్‌ కలిగి ఉన్న ఎస్‌బీఐ.. యోనో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా భారతీయ బ్యాంకింగ్ రంగంలో తన వృద్ధిని బలోపేతం చేస్తోంది. 2024-25 మొదటి త్రైమాసికంలో 63 శాతం సేవింగ్స్ ఖాతాలు డిజిటల్‌ విధానంలో ఓపెన్ అయ్యాయి. అంతే కాకుండా యోనో ద్వారా మొత్తం రూ.1,399 కోట్ల వ్యక్తిగత రుణాల చెల్లింపులు జరిగినట్లు సమాచారం. 

IAF World Space Award: ఇస్రో చైర్మన్ సోమనాథ్‌కు ‘ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024’

#Tags