Narendra Modi: మోదీకి గయానా, డొమినికా దేశాల అత్యున్నత పురస్కారాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది.

గయానా, డొమినికా దేశాలు ఆయనను తమ అత్యున్నత జాతీయ పురస్కారాలతో సత్కరించాయి. కోవిడ్-19 మహమ్మారి ఉధృతి సమయంలో అందించిన సహాయంతోపాటు ప్రపంచ సౌభాగ్యానికి, తమ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేశాయి. 

గయానా రాజధాని జార్జ్ టౌన్‌లో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ న‌వంబ‌ర్ 20వ తేదీ మోదీకి 'ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్' అవార్డు అందజేశారు. 

అలాగే.. డొమినికా అధ్యక్షుడు సిల్వానీ బర్టన్ 'డొమినికా అవార్డు ఆఫ్ హానర్'తో మోదీని సన్మానించారు. రెండు కరీబి యన్ దేశాల అత్యున్నత పురస్కారాలు తనకు లభించడం పట్ల ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ రెండు పురస్కారాలను 140 కోట్ల మంది భారతీయులకు, ఆయా దేశాలతో కొనసా గుతున్న చరిత్రాత్మక ద్వైపాక్షిక సంబంధాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

India-Guyana Relations: గయానాతో 10 ఒప్పందాలు కుదుర్చుకున్న మోదీ..

బార్బడోస్‌ కూడా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి అందజేస్తామని తెలిపింది. దీంతో కలిపి ప్ర‌ధాని మోదీకి లభించిన అవార్డుల సంఖ్య 19కి చేరుతుంది. 

#Tags