Kristi Shikha: రికార్డ్.. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించిన కృతి

అస్సాంలోని అభయపురికి చెందిన కృతి శిఖా 41 నిమిషాల 34 సెకన్లలో నిరంతరాయంగా 21 పాటలు పాడి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది.

తొమ్మిదేళ్ల కృతి శిఖా పాడిన పాటల్లో అస్సామీతో పాటు హిందీ పాటలు కూడా ఉన్నాయి. చిన్నారి కృతి శిఖా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించడం ఇది రెండోసారి.

తల్లిదండ్రులు గాయకులు కావడంతో ఇంటినిండా సంగీత వాతావరణమే కనిపిస్తుంది. చిన్నారి కృతి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ ఆప్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించిన సందర్భంగా గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. 

Nelson Mandela Award: నిమ్‌హాన్స్ ఇన్స్టిట్యూట్‌కు ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా అవార్డు

#Tags