AP Government Employees Transfers 2024 : ఈ 12 శాఖల్లోని ఏపీ ఉద్యోగులు బదిలీలకు ఆమోదం.. రూల్స్ ఇవే.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.

రెవెన్యూ, పంచాయితీ రాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది. ఆగ‌స్టు చివ‌రిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

☛➤ APPSC New Jobs Notifications System 2024 : ఇక‌పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల‌కు ఇలా నోటిఫికేష‌న్లు ఇవ్వాలి..! ఇంకా..

ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు..
ఆగస్టు 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్‌ శాఖలో బదిలీలకు సెప్టెంబర్‌ 5 నుంచి 15వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

#Tags