OU Distance Education 2024-25 Admissions : ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలకు ద‌రఖాస్తుల‌ను కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగ‌స్టు 16వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు :  కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
కోర్సు వ్యవధి : పీజీకి రెండేళ్లు, యూజీకి మూడేళ్లు, అడ్వాన్స్‌డ్ డిప్లొమాకి ఏడాది, సర్టిఫికేట్ కోర్సుకు ఆరు నెలలు ఉండాలి.
బోధన విధానం :  కోర్సును బట్టి ఇంగ్లిష్ లేదా తెలుగు లేదా ఉర్దూ రెండు మాధ్యమాలు ఉంటాయి.

దూరవిద్య పీజీ కోర్సులు ఇవే..
➤☛ ఎంబీఏ, ఎంసీఏ 
➤☛ ఎంఏ హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ.
➤☛ ఎంఎస్సీ మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌
➤☛ ఎంకాం

దూరవిద్య డిగ్రీ కోర్సులు ఇవే..
➤☛ బీఏ: మ్యాథ్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ 
➤☛ బీకాం: జనరల్‌
➤☛ బీబీఏ

డిప్లొమా కోర్సులు ఇవే..
➤☛ అడ్వాన్స్‌డ్ డిప్లొమా మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, వేదిక్‌ ఆస్ట్రాలజీ
➤☛ అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా వేదిక్‌ ఆస్ట్రాలజీ
➤☛ సర్టిఫికేట్ కోర్సు యోగా

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సుల పూర్తి వివ‌రాలు ఇవే.. 

#Tags