APSET 2024 Notification: ఏపీ సెట్‌ 2024 నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

  • ఏపీ సెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల
  • మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహణ

ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా చేరాలనుకునే అభ్యర్థుల ప్రతిభ, నైపుణ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించే అర్హత పరీక్ష.. ఏపీసెట్‌(ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష). ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. తాజాగా ఆంధ్రా యూనివర్సిటీ ఏపీసెట్‌–2024 ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఏపీసెట్‌కు దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ తదితర వివరాలు..

మొత్తం 30 సబ్జెక్టులు
ఏపీసెట్‌లో మొత్తం 30 సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సొషియాలజీ సబ్జెక్ట్‌లు  రెండు భాషల్లో (తెలుగు/ఇంగ్లిష్‌) నిర్వహిస్తారు. మిగతా సబ్జెక్టులు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి. అభ్యర్థులు తాము చదివిన పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్ట్‌ సెట్‌ జాబితాలో లేకుంటే.. ఏదైనా ఇతర సంబంధిత సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

చదవండి: APSET Notification 2024: ఏపీ సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

సబ్జెక్టులు
జనరల్‌ పేపర్‌ ఆన్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ (పేపర్‌–1), ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్‌ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్‌–అట్మాస్పియరిక్‌–ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్, లా, లైఫ్‌ సైన్సెస్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్స్‌ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సొషియాలజీ, సోషల్‌  వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్‌ ఆర్ట్స్‌ సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది.

అర్హతలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో పీజీ పూర్తిచేయాలి. పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు/పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు  చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

పరీక్ష విధానం

  • ఏపీసెట్‌ పరీక్ష ఆఫ్‌లైన్‌ (పెన్‌–పేపర్‌) విధానంలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు 1, పేపర్‌ 2 ఉంటాయి. పేపర్‌–1లో 50 ప్రశ్నలు–100 మార్కులకు, పేపర్‌–2లో 100 ప్రశ్నలు–200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు.
  • పేపర్‌–1లో.. టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ను అన్ని విభాగాల అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్‌ తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది.
  • పేపర్‌–2 పరీక్ష అభ్యర్థి పోస్టుగ్రాడ్యుయేషన్‌ ఈ విభాగంలో పూర్తిచే శారో దానిపై ఉంటుంది.

టీచింగ్‌/రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ (పేపర్‌–1) 

  • ఈ పేపర్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌పై ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్‌ తరహాలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ఇది అందరూ రాయాల్సిన కామన్‌ పేపర్‌. మొత్తం 50 ప్రశ్నలు–100 మార్కులకు పేపర్‌–1 పరీక్ష జరగుతుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కు­ల చొప్పున కేటాయించారు. ఎలాంటి నెగిటివ్‌  మార్కులు లేవు. తెలుగు/ఇంగ్లిష్‌లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ పేపర్‌కు కేటాయించిన సమయం ఒక గంట మాత్రమే.
  • పేపర్‌–1లో టీచింగ్‌  ఆప్టిట్యూడ్, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్‌ రీజనింగ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ), పీపుల్, డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్‌ ఎడ్యుయేషన్‌ సిస్టమ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌ (పేపర్‌–2): ఇది అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌ (ఎలక్టివ్‌)కు సంబంధించిన పేపర్‌. ఇందులో ఆబ్జెక్టివ్‌ తరహ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయించారు.

చదవండి: AP TET 2024 Notification: నాలుగు పేపర్లుగా టెట్‌.. మెథడాలజీ, పెడగాజీలే మంచి మార్కులకు కీలకం... ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

ప్రిపరేషన్‌ ఇలా

  • ఈ పరీక్షలో అందరికీ కామన్‌గా ఉండే పేపర్‌–1 ఎంతో కీలకమైంది. ఈ పేపర్‌ సిలబస్‌ కొంత భిన్నంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తొలుత పేపర్‌–1పై దృష్టిపెట్టి ప్రిపరేషన్‌ కొనసాగించాలి. » పేపర్‌–2లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. 
  • ఇది అభ్యర్థి పీజీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌. దీనికోసం యూజీసీ గతంలో నిర్వహించిన నెట్‌ ప్రశ్నపత్రాలు, సెట్‌ గత పేపర్లను పరిశీలించి సన్నద్ధం కావాలి.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06.03.2024
  • ఏపీసెట్‌ పరీక్ష తేదీ: 28.04.2024
  • వెబ్‌సైట్‌: https://apset.net.in/

చదవండి: TRT/DSC Latest Updates

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags