APSET Notification 2024: ఏపీ సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

ఆంధ్రా యూనివర్శిటీ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఉత్తీర్ణత ద్వారా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లుగా కొలువు పొందేందుకు అర్హత లభిస్తుంది.

సబ్జెక్టులు: జనరల్‌ పేపర్‌ ఆన్‌ టీచింVŠ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌(పేపర్‌-1), ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్‌ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్‌-అట్మాస్పియరిక్‌ -ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్స్, ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్, లా, లైఫ్‌ సైన్సెస్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం,సోషియాలజీ, సోషల్‌ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్‌ ఆర్ట్స్‌.
అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: గరిష్ట వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు.
పరీక్ష వ్యవధి: మూడు గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 14.02.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.03.2024.
పరీక్ష తేది: 28.04.2024.

వెబ్‌సైట్‌: https://apset.net.in/

చదవండి: AP TET 2024 Notification: నాలుగు పేపర్లుగా టెట్‌.. మెథడాలజీ, పెడగాజీలే మంచి మార్కులకు కీలకం... ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

#Tags