ఆంధ్రప్రదేశ్‌ – అడవులు

అడవులు – రకాలు
నేలలు, వర్షపాతంపై అడవుల విస్తరణ ఆధారపడి వుంటుంది.

1. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు

  • 125 సెం.మీ నుంచి 200 సెం.మీ వరకు వర్షం పడే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.
  • శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి.
  • ఈ అడవుల్లోని ప్రధాన వృక్ష జాతులు – టేకు, వెదురు, మద్ది, వేగిస, బండారు, జిట్టెగి, చిరుమాను మొదలైనవి.
  • రాష్ట్రంలో ప్రధాన అడవులు–ఆకురాల్చు రకం
  • వీటినే రుతుపవన అరణ్యాలు అంటారు.
2. అనార్ద్ర ఆకురాల్చు అడవులు:
  • 75–100 సెం.మీ వర్షం పడే ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి.
  • కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి
  • ఈ రకం అడవుల్లో ప్రధాన వృక్షాలు – మద్ది, టేకు, వెలగ, బిల్లు, వేప, దిరిసెన, బూరుగ, వెదురు, మోదుగ, ఎర్ర చందనం మొదలైనవి.
3. చిట్టడవులు
  • 70 సెం.మీ కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇవి ఉంటాయి.
  • ఇవి ముళ్ల జాతి పొద అడవులు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో విస్తరించి వున్నాయి.
  • వీటిలోని ప్రధాన వృక్షాలు – తుమ్మ, బలుసు, రేగు, కలబంద, బ్రహ్మజెముడు మొదలైనవి.
4. ఆటు–పోటు అడవులు
  • నదులు, సముద్రం కలిసే బురద, ఒండ్రు, చిత్తడి నేలల్లో ఇవి పెరుగుతాయి.
  • తుపాన్లు, సునామీల నుంచి రక్షణ కల్పిస్తాయి.
  • వీటినే మాన్‌గ్రూవ్‌/టైడల్‌ అడవులు అంటారు.
  • మడ చెట్లు పెరగడం వల్ల వీటిని మడ అడవులు అంటారు.
  • ఆంధ్రప్రదేశ్‌లోని టైడల్‌ అడవులను ‘కోరింగ అడవులు’ అంటారు.
  • ఈ రకమైన అడవులు కృష్ణా, గోదావరి నదీ ముఖ ద్వారాల్లో ఉన్నాయి.
  • ఈ అడవుల్లో వృక్ష జాతులు – మడ, ఉప్పుపొన్న, బొడ్డుపొన్న, ఉరడ, తెల్లిమడ, కదిలి, టిళ్ల మొదలైనవి.
5. సముద్ర తీరప్రాంత అడవులు
  • సముద్ర తీర ప్రాంత ఇసుకలో ఇవి పెరుగుతాయి.
  • చిన్న చిన్న పొదలు, సరుగుడు చెట్లు, పత్రితుంగ, బాలబంతి తీగ మొదలైనవి పెరుగుతాయి.
2015–16 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అడవుల వైశాల్యం –36,914.7 చ.కి.మీ.
  • రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణతా శాతం – 23.04%
  • దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ 9వ స్థానంలో ఉంది.
  • రాష్ట్రంలో దట్టమైన అడవుల విస్తీర్ణం – 651.25 చ.కి.మీ.
  • రాష్ట్రంలో మధ్యరకం అడవులు – 11,810.2 చ.కి.మీ
  • రాష్ట్రంలో ఓపెన్‌ ఫారెస్ట్‌ అటవీ ప్రాంతం–10,938.5 చ.కి.మీ
  • రాష్ట్రంలో చిట్టడవుల వైశాల్యం – 9,241.77 చ.కి.మీ
  • 2015–అటవీ శాఖ నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం – 34,572 చ.కి.మీ (దీని ప్రకారం–21.5%).
  • ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను విలీనం చేయడం వల్ల 2.02 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగింది.
  • 1952 అటవీ విధాన తీర్మానం ప్రకారం అడవులు 33.3% ఉండాలి.
  • రాష్ట్రంలోకెల్లా పెద్ద అడవులు – నల్లమల అడవులు.
  • అటవీ వైశాల్యం అత్యధికంగా ఉన్న జిల్లా – కడప జిల్లా (5052 చ.కి.మీ)
  • అటవీ వైశాల్యం అత్యల్పంగా ఉన్న జిల్లా – కృష్ణా జిల్లా (644 చ.కి.మీ)
  • శాతం పరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా – విశాఖపట్నం (39.5)
  • శాతం పరంగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా – కృష్ణా (7.6)
  • అటవీ ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ఆదాయం – రూ.19.89 కోట్లు (2015–16)
అటవీ ఉత్పత్తులు
టేకు
గృహోపకరణాలకు ఉపయోగపడుతుంది
ఉభయ గోదావరి, విశాఖపట్నం, అడవుల్లో లభిస్తుంది.

ఎర్రచందనం

అత్యంత ఖరీదైంది.
రంగులు, బొమ్మలు, జంత్ర వాద్యాల తయారీలో ఉపయోగిస్తారు.
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో పెరుగుతాయి.
జర్మనీ, జపాన్‌ దేశాలకు ఎగుమతి అవుతుంది.

మంచిగంధం
పౌడర్లు, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.
చిత్తూరు, అనంతపురం జిల్లాల అడవుల్లో పెరుగుతుంది.

కుంకుడు, కరక్కాయలు
ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు
ఉభయ గోదావరి, విశాఖ జిల్లా అడవుల్లో పెరుగుతాయి.

మగ వెదురు
పోలీసు లాఠీల తయారీకి ఉపయోగిస్తారు.
విశాఖ అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి.

యిప్ప పువ్వు
సారాయి తయారీలో ఉపయోగిస్తారు.
కర్నూలు జిల్లా అడవుల్లో పెరుగుతుంది.

అడవులు–సంరక్షణ

  • అడవులను నరకడాన్ని నిషేధిస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం 1864, 1878ల్లో చట్టాలు చేసింది.
  • 1952లో 33.3% అడవులు ఉండాలని జాతీయ అటవీ విధాన తీర్మానం చేశారు.
  • 1988లో అడవులపై గిరిజనులకు భాగ స్వామ్యం కల్పిస్తూ అటవీ విధానాన్ని వునరుద్ధరించారు.
  • 1974లో అడవుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు.
  • 1980లో అడవుల సంరక్షణ చట్టం చేశారు.
  • 2006లో పర్యావరణ విధానాన్ని ప్రకటించారు.

65వ వన మహోత్సవం
2014 ఆగష్టు–24న హైదరాబాద్‌లో నిర్వహించారు. విశాఖ జిల్లా గాజువాక మండలం వడ్లమూడి గ్రామంలో ప్రారంభించారు.

66వ వన మహోత్సవం
2015 జూలై 17న కృష్ణా జిల్లా జక్కంపూడి గ్రామం పరిధిలోని కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్టులో నిర్వహించారు.

నీరు చెట్టు కార్యక్రమం
నీటి కొరతను తగ్గించడానికి, పర్యావరణాన్ని కాపాడేందుకు నీరు–చెట్టు కార్యక్రమాన్ని 2015 ఫిబ్రవరి 19న చిత్తూరు జిల్లా వి.కోట మండలం తంబాలపల్లి గ్రామంలో ప్రారంభించారు.

కార్తీక వన మహోత్సవం
2015–నవంబర్‌ 25న ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ జిల్లాల్లో 14.77 లక్షల మొక్కలు నాటారు.

సామాజిక అడవులు: వాతావరణ సమతుల్యాన్ని పరి రక్షించేందుకు, పరిశ్రమల అభివృద్ధికి, భూ క్రమక్షయాన్ని వివారించేందుకు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది.
సామాజిక అడవుల పెంపకం కార్యక్రమం 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమైనా 6వ ప్రణాళికలో ఎక్కువగా ప్రోత్సహించారు. 1976–80 మధ్య కాలంలో దేశంలో భారీగా టేకు, ఎర్రచందనం, వెదురు, యూకలిప్టస్‌ లాంటి చెట్లను పెంచారు. 1980–82లో ఆంధ్రప్రదేశ్‌లో వీటి పెంపకం చేపట్టారు.

అటవీ పరిశోధన
హైదరాబాద్‌ కేంద్రంగా 1971–72లో అటవీ పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
రాజమండ్రి, తిరుపతిల్లో పరిశోధనలకు సంబంధించి ఆరు ఉపకేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు.

ఎకోపార్కు
ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ఇడుపుల పాయ వద్ద రాజీవ్‌ ఎకోపార్కును అభివృద్ధి చేసింది. దీన్ని ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు.


మాదిరి ప్రశ్నలు

1. అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానం?
 1) 8 
 2) 12 
 3) 9 
 4) 10














































#Tags