AP SI Jobs Final Results 2023 : ఏపీ ఎస్‌ఐ ఫైన‌ల్‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎస్సై ఉద్యోగాల ఫైన‌ల్ ఫ‌లితాల‌ను డిసెంబ‌ర్ 6వ తేదీన‌(బుధ‌వారం విడుద‌ల‌ను చేశారు. అలాగే పైన‌ల్ కీ కూడా విడుద‌ల చేశారు.

ఏపీ రాష్ట్ర హైకోర్టు స్టే ఆర్డ‌ర్‌తో ఈ ఫ‌లితాల‌ను తాత్కాలికంగా బ్రేక్ పడిన విష‌యం తెల్సిందే.అయితే ఈ ఎస్ ఉద్యోగాల కొల‌త‌ల‌పై  ఏపీ రాష్ట్ర హైకోర్టు న‌వంబ‌ర్ 25వ తేదీ (శ‌నివారం) కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది. కోర్టు ప‌రిధిలోనే ఎస్ఐ ఉద్యోగాల‌కు సంబంధించిన‌ ఛాతీ, ఎత్తు కొల‌వాల‌ని హైకోర్టు ఆదేశించిన విష‌యం తెల్సిందే.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ సివిల్‌, రిజర్వ్ విభాగాల్లోని 411 పోస్టుల భర్తీకి ఈ ఏడాది పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ నియామకాల్లో అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు హైకోర్టు కోర్టును ఆశ్రయించిన విష‌యం తెల్సిందే. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్‌ వేశారు.

ఏపీ ఎస్‌ఐ ఫైన‌ల్‌ ఫ‌లితాలు విడుద‌ల కోసం క్లిక్ చేయండి

ఏపీ ఎస్‌ఐ ఫైన‌ల్ కీ విడుద‌ల కోసం క్లిక్ చేయండి
ప్రాథమిక రాత పరీక్షకు 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 57 వేల మందికిపైగా అర్హత సాధించారు. అనంతరం వీరికి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ టెస్ట్‌ల్లో దాదాపు 35 వేల మంది పురుషులు, మహిళలు అర్హత సాధించారు. వీరికి గత నెల 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించగా.. 30 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని అక్టోబరు 15న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 18 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. 

ఏపీ ఎస్‌ఐ ఫైన‌ల్‌ ఫ‌లితాల పూర్తి వివ‌రాలు ఇవే..
 

#Tags