AP Police Jobs : నిరుద్యోగులకు గూడ్‌న్యూస్‌.. భారీగా పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌.. త్వరలోనే నోటిఫికేషన్.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్ర‌దేశ్‌లోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీపావళి గుడ్‌న్యూస్ అందించారు.
AP CM YS Jagan Mohan Reddy

6,511 పోలీస్ ఉద్యోగాల‌ నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు  నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేర‌కు అధికారులు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవ‌కాశం ఉంది.

➤ Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!

రిజర్వ్‌ విభాగంలో 96 ఎస్సై పోస్టులను, అలాగే సివిల్‌ విభాగంలో 315 ఎస్సై పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్పెషల్‌ విభాగంలో 2520 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. అలాగే సివిల్‌ విభాగంలో 3580 కానిస్టేబుల్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 6511 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఒకే సారి ఇచ్చే అవ‌కాశం ఉంది. అత్యధికంగా సివిల్‌ విభాగంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కొన్నేళ్లుగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగుల‌కు త్వ‌ర‌లోనే ఊర‌ట ల‌భించ‌నున్న‌ది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags