AP Police Constable Jobs 2024 : ఏపీలో 6,500 కానిస్టేబుల్ ఉద్యోగ‌ నియామకాలు.. ఇంకెప్పుడు భ‌ర్తీ చేస్తారు..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 6,500 పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది.

ఆగస్టు నెలాఖరులోగా.. 
డీజీపీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ పీహెచ్‌డీ రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారయ్యే అవకాశం ఉంది.

ఏపీ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరైన విష‌యం తెల్సిందే. వీరిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరందరికీ రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

#Tags