AP Police Notification: హోంగార్డులకు వయసు మినహాయింపు ఎంతంటే....

హోంగార్డులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే హోంగార్డుల వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఏపీ పోలీసుశాఖలో 6,100 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆఖరు తేదీని డిసెంబర్‌ 28గా నిర్ణయించింది. వయసు మినహాయింపు ఇవ్వడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా జనవరి 7వ తేదీ వరకు తేదీని పొడిగించింది.

చ‌ద‌వండి: 6511 పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి
వీరే అర్హులు...
నోటిఫికేషన్‌ విడుదలయ్యే సమయానికి వారు హోంగార్డులుగా విధుల్లో ఉండాలి. అలాగే 360 పనిదినాలు చేసి ఉండాలి. ఇలాంటి వారు 1988 జులై 2 నుంచి 2004 జులై 1 మధ్య జన్మించి ఉండాలి. ఈ మేరకు స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ మనీష్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు. దీంతో గత కొన్నేళ్లుగా హోంగార్డులుగా చేస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించినట్లైంది. వయసు మినహాయింపుతో హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సాధారణ అభ్యర్థులకు కూడా రెండేళ్ల వయసు మినహాయింపునిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

#Tags