AP EAMCET Results 2024: నేడే ఏపీ ఎంసెట్ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి
ఏపీ ఎంసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను నేడు(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నట్లు సెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు ఓ ప్రకటనలో తెలిపారు.
ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రామమోహన్‌రావు సంయుక్తంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్(EAMCET)పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
మొత్తం 3,62,851 మంది విద్యార్ధులు ఈఏపీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ ఫలితాల కోసం కింది లింక్స్‌ని క్లిక్ చేయండి.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఫలితాల కోసం డైరెక్ట్ లింక్ ఇదే..
ఎంసెట్- ఇంజనీరింగ్ ఫలితాల కోసం డైరెక్ట్ లింక్ ఇదే..