AP DSC 2024 Notification Details : బ్రేకింగ్ న్యూస్‌.. ఏపీ డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ సిల‌బ‌స్ ప్ర‌కారం ప‌రీక్ష‌లు.. అలాగే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ‌ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన‌ డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను ఫిబ్ర‌వ‌రి 12వ తేదీన (సోమవారం) విడుద‌ల చేశారు.

డీఎస్సీ-2024 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఫిబ్రవరి 21లోగా నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ఫలితాలు వెలువడనున్నాయి. మార్చి 5వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో hall ticket అందుబాటులో ఉండ‌నున్నాయి. 2018 సిల‌బ‌స్‌ ప్ర‌కార‌మే ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 31వ తేదీన ప్రాథ‌మిక కీ ని  విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సారి టెట్‌కి 20 శాతం, డీఎస్సీ కి 80శాతం వెయిటేజీ ఇవ్వ‌నున్నారు.

వ‌యో ప‌రిమితి ఇలా.
.
డీఎస్సీ అభ్యర్థుల‌కు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బరంపూర్లో కేటాయించారు. ఆన్లైన్ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఉదయం విడత 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

వివిధ కేటగిరీల్లోని 6100 పోస్టులను..
డీఎస్సీ(టీఆర్టీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల్లోని 6100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్ 8న పోస్టింగులు ఇవ్వనున్నారు. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు.

ఈ సారి కొత్త‌గా..
ఈసారి కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకురానున్నారు. రాత పరీక్షలో ఎంపికైన టీచర్లకు రెండేళ్లపాటు గౌరవవేతనానికి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి స్కేల్ వస్తుంది. కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్, డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు. అప్రెంటిస్షిప్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిస్షిప్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది.ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

పోస్టుల వివరాలు ఇవే...

 ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్

☛ ఎస్టీజీ: 2280 పోస్టులు

☛స్కూల్ అసిస్టెంట్: 2299 పోస్టులు

☛ టీజీటీ: 1264 పోస్టులు

☛ పీజీటీ: 215 పోస్టులు

☛ ప్రిన్సిపల్: 42 పోస్టులు

ఏపీ డీఎస్సీ షెడ్యూలు ఇలా..

☛  ఏపీ డీఎస్సీ-2024 షెడ్యూలు వెల్లడి: 07.02.2024.

☛  ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్  వెల్లడి : 12.02.2024.

☛   ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.02.2024.

☛   ఫీజుచెల్లింపు తేదీలు: 12.02.2024 - 21.02.2024.

☛ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.02.2024.

☛ ఆన్లైన్ మాక్టెస్టు అందుబాటులో: 24.02.2024.

☛  పరీక్ష హాల్టికెట్ల డౌన్లోడ్: 05.03.2024 నుంచి.

☛  ఏపీ ఎస్సీ-2024 పరీక్ష తేదీలు: 15.03.2024 నుంచి 30.03.2024 వరకు.

పరీక్ష సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్) పరీక్షలు నిర్వహిస్తారు.

☛ ఆన్సర్ కీ వెల్లడి: 31.03.2024.

☛ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 31.03.2024 నుంచి 01.04.2024 వరకు.

☛ ఫైనల్ కీ వెల్లడి:02.04.2024.

☛  డీఎస్సీ-2024 ఫలితాల వెల్లడి: 07.04.2024

#Tags