7. జీవ క్రియలలో సమన్వయం
మానవ శరీరం ఒక అద్భుత యంత్రం. ఇది యంత్రం వలె సంక్లిష్ట నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మానవ జీర్ణ వ్యవస్థలో కండర, నాడీ వ్యవస్థలు పాల్గొంటాయి. జీర్ణ వ్యవస్థకురక్త ప్రసరణ వ్యవస్థ సమన్వయంతో శరీరంలోని జీవక్రియలన్నింటిని చక్కగా నిర్వహిస్తాయి.
- జీర్ణా శయంలో ‘గ్రీలీన్’ హార్మోన్ స్రవించడం వలన ఆకలి ప్రచోదనాలు ‘లెఫ్టీన్’ హార్మోన్ వల్ల ఆకలిని అణచివేసే ప్రచోదనాలు మెదడుకు ప్రసారం చెందుతాయి.
- ముక్కు, నాలుకపై ఉన్న రసాయన గ్రాహకాలు సంకేతాలను నాడీ ప్రచోదనాల రూపంలో మెదడుకు చేరవేస్తాయి. తద్వారా వాసనను, రుచిని గుర్తించ గలుగుతాయి. ఈ ప్రక్రియకు వేగస్‌నాడీ మరియు ద్వార గోర్థము ముఖ్య పాత్ర పోషిస్తాయి.
- మానవుని నోటి యందు 3 జతల లాలాజల గ్రంధులు ఉంటాయి. వీటి నుండి ఉత్పత్తయ్యే లాలాజలం ఆహారానికి తేమను, జారుడు గుణాన్ని కలిగిస్తుంది.
- నోటిలో 4 రకాల దంతాలు-కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా ‘చూర్ణం చేయుట’కు తోడ్పడును. ఆస్యకుహరంలో ఆహారముద్ద (బోలస్)గా మారుతుంది.
- జీర్ణనాళం యొక్క కండరాల సంకోచ సడలికల వల్ల ఆహారం తరంగాల రూపంలో కదులుతుంది. ఈ క్రియను ‘పెరిస్టాలిసిస్’ అంటారు. ఈ విధంగా ఆహారం జీర్ణాశయంలోకి జారుకుంటుంది.
- జీర్ణాశయంలో ph ఆమ్లయుతంగా ఉండటంతో ప్రొటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్ చర్యలకు తోడ్పడుతుంది. చిన్న ప్రేగులో ‘ఆంత్ర చూషకాలు’ ఉపరితల వైశాల్యాన్ని పెంచి పోషకాలకు గ్రహించడంలో తోడ్పతాయి. ఆంత్రమూలంలో ‘కైమ్’ ప్రవేశాన్ని నియంత్రించే పైలోరిక్ లేదా సంవరిణి కండరం ఉంటుంది.
- జీర్ణ వ్యవస్థలోని ప్రత్యేక నాడీ వ్యవస్థను ‘జీర్ణాంతర నాడీ వ్యవస్థ’ అంటారు. దీనినే ‘రెండవ మెదడు’ అని కూడా అంటారు.
- పెద్ద ప్రేగు నుండి నత్రజని వ్యర్థాలను మలం రూపంలో పాయువు నుండి బయటకు పంపడాన్ని పాయువు వద్ద నున్న బాహ్య పాయువు సంవరిణీ కండరం, అంతరపాయువు సంవరిణి కండరం నియంత్రిస్తాయి.
- ఆహార పదార్థాల ఆక్సీకరణ, రవాణా, వినియోగం కొరకు - జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్తప్రసరణ వంటి జీవక్రియల మధ్య సమన్వయం అవసరం. ఈ ప్రక్రియలు సరిగా జరగడానికి కండర, నాడీ నియంత్రణ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి.
క్విక్ రివ్యూ
జీవక్రియలు: జీవి మనుగడకు, వంశాభివృద్ధికి అవసరమైన క్రియలను జీవక్రియలు అంటారు. ప్రతి జీవక్రియ ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు జీర్ణక్రియకు నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ సమన్వయం అవసరం.
జీర్ణక్రియా హార్మోనులు: జీర్ణాశయంలో స్రవించబడే గీలిన్ హార్మోన్ ఆకలి ప్రచోదనాలను కలిగిస్తుంది. లెప్టీన్ హార్మోన్ ఆకలి అణచి వేస్తుంది. ఈ సంకేతాలను మెదడుకు చేర్చడానికి డైఎన్‌సెఫలాన్, వేగస్ నాడీ కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలి కోరికలు 30- 45 నిమిషాల వరకు కొనసాగుతాయి.
రుచి మొగ్గలు: నాలిక మీద ఉండే ఉబ్బెత్తు నిర్మాణాలను లేదా బొడిపెల వంటి నిర్మాణాలు. ఇవి రుచిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సంవరిణి కండరం(Anal Sphineter): పెద్ద పేగు చివరి భాగంలో ఉండే రెండు కండర పొరలు పాయువు సంవరిణి కండరాలుగా ఏర్పడుతాయి. లోపలి సంవరిణి కండరం అనియంత్రితంగా, బాహ్య సంవరిణి కండరం నియంత్రితంగా పనిచేస్తుంది. ఈ కండర సంవరిణిలు మల విసర్జన మార్గాన్ని నియంత్రిస్తాయి.
రెండో మెదడు: ఆహార వాహిక నుంచి పాయువు వరకు దాదాపు 9 మీ. పొడవు కలిగి జీర్ణనాడీ వ్యవస్థగా (Enteric Nervous system) పిలవబడుతున్న భాగమే రెండో మెదడు. దాదాపు 100 మిలియన్ల నాడీ కణాలు దీనిలో ఇమిడి ఉంటాయి. రెండవ మెదడు స్వీయ ప్రతి స్పందనలను, జ్ఞానేంద్రియ శక్తిని కలిగి ఉండడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన వివిధ పనులను మెదడు ప్రమేయం లేకుండా స్వతంత్రంగా నియంత్రిస్తుంది.
4 మార్కుల జవాబులు
- చిన్న ప్రేగులోని ఆంత్రచూషకాల నిర్మాణాన్ని తెలిపే చిత్రం గీయండి. జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థలలో గల సహసంబంధాన్ని వివరించండి. (AS-5)
జ:- జీర్ణక్రియ ఆహార నాళంలో జరుగుతున్నప్పటికీ, ఈ క్రియకు రక్తప్రసరణ వ్యవస్థ, శ్వాసవ్యవస్థ సమన్వయం ఎంతో అవసరం.
- ఆహార నాళంలో జీర్ణం చేయబడిన ఆహారం రక్త ప్రసరణ వ్యవస్థలోకి ఆంత్రచూషకాలు (Villi) ద్వారా పీల్చుకోబడతాయి.
- ఫలితంగా శరీర కణాలకు శక్తి నందించడానికి కావలసిన ఆహార పదార్థాలు గ్లూకోజు రూపంలో అందుతాయి.
- ఆ ఆహార పదార్థాలను అంత్రచూషకాల ద్వారా రక్తం పీల్చుకోకపోతే, అవన్నీ బయటకు విసర్జించబడతాయి.
- శ్వాస వ్యవస్థలోని ఆక్సీజన్ పదార్థాల ఆక్సీకరణకు తోడ్పడును.
- కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ ఎంతో సమన్వయంతో పనిచేస్తుంది.
- జీర్ణ క్రియలో ఆహార పదార్థాల కదలికలను తెలిపే పటం ద్వారా, ఆహార కదలికలకు తోడ్పడే నాడులు, కండరాల గురించి వివరించుము. (AS-5)
జ:- మిశ్రమ ఆహారాన్ని తీసుకునే జంతువులు, మానవులు నేరుగా మింగకుండా నోటిలో దంతాలతో నమిలి చిన్న చిన్న ముక్కలుగా విచ్చిన్నం చేస్తాయి. ఈ విధానాన్ని చూర్ణం చేయడం (Mastigation) అంటారు.
- ఆహారం ఆస్యకుహారంలోనికి నెట్టడానికి 5వ కపాలనాడీ దవడలోని అంతర కండరాలను నియంత్రిస్తుంది.
- నోటిలో ఉండే వలయాకార కండరాలు ఆహారాన్ని నోటిలోకి నెట్టడంలోనూ మరియు నోటిలో చుట్టూ కదిలించడంలోనూ సహాయపడతాయి.
- ఆహారం చూర్ణం చేయడంలో ఉపరితల కండరాలు ఆహారాన్ని దంతాల క్రిందికి నెట్టడం మరియు నమలడం క్రియలను నిర్వహిస్తాయి.
- దవడలోని అంతర కండరాలు ఆహారం నమిలేటపుడు క్రింది దవడను పైకి, క్రిందకు, ముందూ వెనకకూ కదిలించడంలో తోడ్పడతాయి.
- ఆహార వాహికలో ఆహారం పెరిస్టాలిటిక్ చలనాల వలన జీర్ణాశయం చేరుతుంది. ఈ చలనాలు తరంగాల మాదిరిగా ఉంటాయి. ఇవి అనియంత్రిత నాడీ వ్యవస్థ ఆధీనంలో జరుగుతాయి.
- పెరిస్టాలిటిక్ చలనం అంటే ఏమిటి? ఆహారవాహిక లో ఆహారకదలికలను, సైకిల్‌ట్యూబ్‌లో బంగాళదుంపలను కదిలించే ప్రయోగంతో పోలుస్తూ వివరించండి. (AS-3)
జ: పెరిస్టాలిటిక్ చలనం: ఆహార వాహికలో ఆహారముద్ద (బోలస్) ప్రయాణిస్తున్నపుడు, ఏర్పడే అలల వంటి చలనాన్ని ‘పెరిస్టాలిటిక్ చలనం’ అంటారు. ఈ ప్రక్రియను ‘పెరిస్టాలిసిస్’ అంటారు.
ప్రయోగం: ఒక పాత సైకిల్ ట్యూబ్ ముక్కను తీసుకొని, లోపలి భాగాన్ని నూనెతో పూత పూయాలి. రెండు బంగాళ దుంపల్ని తీసుకుని శుభ్రంగా కడిగి, పొడిగా తుడిచి నూనెతో పూత పూయాలి. బంగాళ దుంపలను సైకిల్ ట్యూబులో ప్రవేశ పెట్టి గొట్టాన్ని పిసుకుతూ బంగాళ దుంపను గొట్టంలో కదిలే విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించవలెను.
పరిశీలన - పోలిక: సైకిల్ ట్యూబులో బంగాళ దుంప కదలిక ఆహార వాహికలోని ఆహారపు ముద్ద కదలికను పోలి ఉంటుంది.
-ఈ ప్రయోగంలో సైకిల్ ట్యూబ్‌ను ఆహారవాహికతోను
-బంగాళ దుంపను ఆహారముద్ద (బోలస్) తోను
-బంగాళదుంపపై నూనెను - లాలాజలం తోనూ
-ట్యూబ్‌లోపల రాసిన నూనె - శ్లేష్మ పదార్థతోనూ పోల్చవచ్చును.
- నోటిలోని దంతాల అమరికను చూపుతూ, దంత సూత్రం తెలపండి. (AS-5)
జ: నోటిలో దంతరకాలను, వాటి సంఖ్యను, అమరికను తెలిపే సూత్రాన్ని దంతసూత్రం అంటారు.
మానవుని దంత సూత్రం:
క్రమ సంఖ్య
దంతరకము
దంతాల సంఖ్య
మొత్తం
ఆకారం
విధులు
1
కుంతకాలు
2
8
వెడల్పుగా
కొరుకుటకు
2
రదనికలు
1
4
మొనదేలి
చీల్చుటకు
3
అగ్రచర్వణకాలు
2
8
చదునుగా
నమలుటకు
4
చర్వణకాలు
3
12
చదునుగా
విసురుటకు
మొత్తం
8
32
మానవునిలో దంతాలు, ఎడమ, కుడి, రెండు దవడలను లెక్కించగా... 8X4=32
- జీర్ణాశయం ఒక మిక్సర్/గ్రైండర్ యంత్రంగా ఎలా పరిగణిస్తావు? లేదా ఎలా అభినందిస్తావు? (AS-6)
జ:- జీర్ణాశయం జీర్ణవ్యవస్థలో పెద్ద భాగం. ఇది సంచి లాంటి నిర్మాణం ఇది ఆహారాన్ని తాత్కాలికంగా నిల్వచేస్తుంది.
- జీర్ణాశయం గోడలు పెరిస్టాలిసిస్ కదలికలను జరిపి ఆహారాన్ని కదపడం ద్వారా చిలకబడుతుంది.
- జఠర రసంలో HCl ఆమ్లం ఆహారంలో బ్యాక్టీరియాలను నశింపజేస్తాయి.
- జీర్ణాశయంలోని జఠరరసం ఆహారాన్ని పాక్షికంగా జీర్ణం చేసి ద్రవస్థితికి తీసుకు వస్తుంది. దీనిని ‘కైమ్’ అంటారు.
- పైలోరిక్ సంవరిణి ద్వారా కొద్ది ఆహారం చిన్న ప్రేగులోకి పంపబడుతుంది.
- వాస్తవానికి జీర్ణాశయం రుబ్బురోలు/గ్రైండర్ యంత్రం వంటి నిర్మాణం.
- జీర్ణాశయం కండర మరియు నాడీ వ్యవస్థల సమన్వయంతో కదలికలను నిర్వహిస్తుంది.
- జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయం నిర్మాణం అద్భుతమైనది. జీర్ణక్రియ విధులు ప్రశంసనీయమైనవి.
- చిన్న ప్రేగు అంతర్నిర్మాణం పటం గీచి, భాగాలను గుర్తించుము.
జ:
- మానవునిలో జరిగే జీవక్రియలు వైవిధ్యాన్ని సమన్వయాన్ని కలిగి ఉంటాయని మీ మాటలలో వర్ణించండి....(AS-7) కవితలో....
జ: అద్భుత భూప్రపంచంలో జీవ సృష్టి అత్యద్భుతం ‘కిరణజన్య సంయోగక్రియ’ అందిస్తున్న మొక్కలే ప్రకృతి వరప్రసాదం. జీవి సరిగా జీవించాలంటే ‘జీవక్రియలు’జరగాలి. ‘పోషణ’,‘ శ్వాసక్రియ’, ‘విసర్జన’....సకలజీవుల మనుగడకు ఆధారాలు ‘ప్రత్యుత్పత్తి’ కల్పిస్తోంది. జీవజాతుల ఉద్భవానికి సహజీవనం ‘నాడీవ్యవస్థ’ సమకూరుస్తోంది. శరీర భాగాలకు సమన్యాయం హార్మోనులు చేస్తాయి. శరీరంలో ‘నియంత్రణ-సమన్వయం’ కణాలు శక్తి పొందాలంటే ‘శ్వాసక్రియ’కు O2సహకరించాలి. ఆహారం జీర్ణం కావాలంటే ‘జీర్ణక్రియ’ జరగాలి. జీర్ణమైన ఆహారం శరీరంలోకి ‘శోషణం’ చెందాలి. శరీరమంతా శక్తి రవాణా కావాలంటే ‘రక్త ప్రసరణం’ జరగాలి. జీర్ణంకాని వ్యర్థాలు బయటికి పోవాలంటే ‘విసర్జన’ జరగాలి. అందుకే జీవి ఆరోగ్యంగా ఉండాలంటే జీవక్రియలే ముఖ్యం.
- ఆహార వాహిక యొక్క క్రియాత్మ, నిర్మాణాత్మక, నిర్మాణాత్మక లక్షణాలు రేఖా పటం ద్వారా వివరింపుము.
జ: ఇది పొడవైన గొట్టం వంటి నిర్మాణంక్రింది భాగం జీర్ణాశయాన్ని కలుపుతుంది. దీని గోడలు స్థితి స్థాపక శక్త గల నునుపు కండరాలు గోడలు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. సంకోచం యధాస్థితికి రావడం వల్ల గోడ కండరాలలో కదలికలు తరంగాల వస్తే వస్తాయి. ఆహారం ముద్ద (బోలస్)పెరిస్టాలిక్ కదలికల ద్వారా జీర్ణాశయం లోకి చేరుస్తుంది.
2 మార్కుల ప్రశ్న జవాబులు
- మనకు ఆకలి కావడానికి కారణం ఏమిటి? (లేదా) ఆకలి వేస్తుందని ఎలా తెలుస్తుంది? (AS-1)
జ: రక్తంలో గ్లూకోజు స్థాయిలు తగ్గిపోతే వెంటనే మనకు ఆకలి వేస్తున్నట్లు తెలుస్తుంది. జీర్ణాశయం ఖాళీ అయినపుడు, జీర్ణాశయ గోడలు ‘గ్రీలిన్’ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఈ హార్మోన్ జీర్ణాశయంలో స్రవించబడగానే ‘ఆకలి సంకేతాలు’ ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణాశయం నుండి మెదడుకు అందగానే ‘ఆకలి ప్రచోదనా’లతో పాటు ఆహారం తినాలనే కోరిక కలుగుతుంది. ఈ ఆకలి కోరికలు 30-45 నిమిషాల వరకు కొనసాగుతాయి.
-
మాస్టిగేషన్, రూమినేషన్ మధ్య తేడాలు ఏమిటి ? (AS-5)
జ:మాస్టి గేషన్ (చూర్ణం చేయడం): రుమినేషన్(నెమరువేయడం): 1. నోటిలో ఆహారాన్ని నములుతూ చిన్న ముక్కలుగా చేసే ప్రక్రియను మాస్టిగేషన్ అంటారు. 1. వేగంగా తీసుకున్న ఆహారాన్ని జీర్ణాశయం నుండి తిరిగి నోటిలోకి తెచ్చుకొని నమలడాన్ని రూమినేషన్ అంటారు. 2. ఆహార సేకరణలో ఇది ప్రాధమిక ప్రక్రియ 2. పాక్షికంగా మాస్టిగేషన్ జరిగిన తర్వాత రుమినేషన్ జరుగుతుంది. 3.దాదాపు అన్ని జంతువులలో మాస్టిగేషన్ ఉంటుంది. 3. ఇది నెమరు వేసే (శాఖాహార)జంతువులలో ఉంటుంది. 4.నోటిలో ఆహారం బోలస్‌గా తయారై జీర్ణాశయంలోకి వెళుతుంది. 4. మొదట తీసుకున్న ఆహారం ముద్దగా మారకుండా, తిరిగి నోటిలో చేరి ముద్దగా మారి జీర్ణాశయంలోకి వెళుతుంది. - మాస్టిగేషన్ అంటే ఏమిటి? దీనికి సహకరించే దంతాలు తెల్పండి? (AS-1)
జ: నోటిలోని దంతాలు ఆహారాన్ని విసిరి, నమిలి చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విధానాన్ని చూర్ణం చేయడం లేదా మాస్టిగేషన్ అంటారు. ఆహారాన్ని నమలడానికి నోటిలో 4 రకాల దంతాలు ఉన్నాయి. అవి
1. కుంతకాలు- కొరకటానికి
2. రదనికలు- చీల్చడానికి
3. అగ్రచర్వణకాలు- నమలడానికి
4. చర్వణకాలు - ఆహారం విసరడానికి సహకరిస్తాయి.
- శరీరంలో రెండవ మెదడుగా దేనిని పరిగణిస్తారు? ఎందుకు? (AS-1)
జ:- ఆహార వాహిక నుండి పాయువు వరకు 9 మీ. పొడవు కలిగిన జీర్ణనాడీ వ్యవస్థ ఉంటుంది. దీనిని రెండవ మెదడుగా పరిగణిస్తారు.
- రెండవ మెదడులో దాదాపు 100 మిలియన్ల నాడీకణాలు ఉంటాయి.
- జీర్ణనాడీ వ్యవస్థ శరీరంలోని రోగ నిరోధక ప్రతిస్పందనలను కలుగ జేస్తుంది.
- జీర్ణనాడీ వ్యవస్థ ముఖ్యమైన సమాచారాన్ని పంపే ‘న్యూరోట్రాన్స్ మీటర్స్’ తో నిక్షిప్తమై ఉంటుంది.
- ఇది స్వీయ ప్రతిస్పందనలను, జ్ఞానేంద్రి శక్తిని కలిగి ఉండటం వలన జీర్ణ వ్యవస్థ చెందిన పనులన్నింటిని మెదడు ప్రమేయం లేకుండా స్వతంత్రంగా నిర్వహిస్తుంది.
- జీర్ణ వ్యవస్థలో పదార్థాలు సజావుగా లోనికి రావడానికి, బయటికి వెళ్ళడానికి వీలుగా ఈ వ్యవస్థ సంక్లిష్టతతో ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
- ‘జీవక్రియలలో సమన్వయం’ పాఠమును అన్వయించుకొని ఆహారం తీసుకునే మెళకువలను తెలపండి (AS-7)
జ:- ప్రతిరోజు నిర్ధిష్టమైన సమయపాలన పాటిస్తూ ఆహారాన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే భుజించాలి.
- ఆహారాన్ని గాబరాగా తినకుండా తగినంత నమిలిన తర్వాతనే మింగాలి.
- ఆహారాన్ని అతిగా తినకూడదు. ముఖ్యంగా రాత్రివేళలో ఆలస్యంగా ఆహారాన్ని తీసుకోవద్దు.
- ఆహారం తినేటప్పుడు మధ్యమధ్యలో ఎక్కువగా నీరు త్రాగవద్దు.
- ఆహారం తింటున్నప్పుడు మాట్లాడకుండా, కూర్చుని ప్రశాంతంగా తినడం అత్యుత్తమ మెళకువగా చెప్పవచ్చు.
- జీర్ణక్రియలో చిన్న ప్రేగు పాత్రను తెల్పండి? (AS-1)
జ: చిన్న ప్రేగు శరీరంలో ఉదరం క్రింది భాగంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. ఇది సుమారు 6. మీ పొడవు ఉంటుంది. చిన్న ప్రేగులో అనేక సూక్ష్మచూషకాలు ఉంటాయి. ఇవి ప్రేగులో ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. అధిక సంఖ్యలో ఉన్న సూక్ష్మచూషకాలు. చిన్న ప్రేగుశోషణ తలం వైశాల్యాన్ని పెంచడమే గాక, చిన్న ప్రేగు నందు ఆహారం సంపూర్ణంగా జీర్ణమవడానికి కావలసిన వైశాల్యాన్ని సమకూరుస్తాయి.
- పగటి పూట నిద్రిస్తున్నప్పుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది? (AS-1)
జ: మనుషులు పగటి వేళలో చురుకుగా ఉంటారు. ఆహార సేకరణ, నడక వంటి ఇత్యాది పనులు పగటి వేళలలో చేస్తూ రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటారు. కాబట్టి మానవులను ‘‘దివాచరులు’’(Diurnal animals) అంటారు. శరీరంలోని వ్యవస్థలన్నీ మనం పని చేస్తున్నప్పుడు చురుకుగా ఉంటాయి. పగటి వేళలో మన జీర్ణ వ్యవస్థ చరుకుగా ఉండడం వల్ల జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పగటి వేళలో నిద్రిస్తే నోటి ద్వారా లాలాజలం (సొంగలాగా) స్రవించబడుతుంది. రాత్రి వేళలో ఇలా జరుగదు. సాధారణంగా ఒకరోజులో 1-1.5 లీ లాలాజలం నోటిలో ఉత్పత్తి అవుతుంది.
-
బోలస్, కైమ్ ల మధ్యతేడాలు తెల్పండి? (AS-1)
బోలస్: కైమ్ 1. ఇది నోరులేదా ఆస్యకుహారంలో ఏర్పడును. 1.ఇది జీర్ణాశయంలో ఏర్పడును. 2. ఇది చాలా కొద్ది పరిమాణంలో ఏర్పడును. 2. ఇది ఎక్కువ పరిమాణంలో ఏర్పడును. 3. ఇది క్షార గుణాన్ని కలిగి ఉండును. 3. ఇది ఆమ్ల గుణాన్ని కలిగి ఉండును. 4. ఇది ఆస్యకుహారం నుండి ఆహార వాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది. 4. ఇది జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోనికి ప్రవేశించును. 5. బోలస్ దాదాపు ఆహారం రంగును కలిగి ఉంటుంది. 5. కొద్దిగా పసుపు రంగును కలిగి ఉంటుంది.
1 మార్కు ప్రశ్న జవాబులు
- ఆహార నాళంలో ఆహారం ప్రయాణ మార్గం సూచించండి?
జ: ఆహార నాళంలో ఆహారం కింది మార్గంలో ప్రయాణి స్తుంది.
- శరీరంలో రెండో మెదడుగా దేన్ని పరిగణిస్తారు?
జ: ఆహార వాహిక నుంచి పాయువు వరకు దాదాపు 9 మీ. పొడవు కలిగిన జీర్ణనాడీవ్యవస్థను రెండో మెదడుగా పిలుస్తారు.
- ఆంత్ర చూషకాలు (villi) అంటే ఏమిటి?
జ: చిన్న పేగుల లోపలి తలంలో ఉన్న వేళ్లలాంటి నిర్మాణాలనే ఆంత్ర చూషకాలు అంటారు. ఇవి చిన్న పేగుల లోపలి గోడల ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి.
- నోటిలో లాలాజలం పాత్ర ఏమిటి?
జ:- ఆహారాన్ని క్షార మాద్యమంలోకి మార్చడానికి తోడ్పడుతుంది.
- ఆహారానికి జారుడుగుణం కలిగించి సులభంగా మింగడానికి తోడ్పడుతుంది.
- లాలా జలంలో టయలిన్‌ను కలిగి చిన్న చిన్న రేణువులుగా మార్చుతుంది.
- పెరిస్టాలిసిస్‌కు సహకరించే కండరాలు ఏవి?
జ: పెరిస్టాలిసిస్ చలనంలో ఆహారపు ముద్ద (బోలస్) ముందుకు కదలడానికి ఆహారపు వాహికలోని వలయాకార కండరాలు, స్తంభాకార కండరాలు తోడ్పడతాయి.
- జీర్ణాశయంలో HCl ఆవశ్యకత ఏంటి?
జ: HCl ఆమ్లం జీర్ణాశయంలోని pHను ఆమ్లయుతంగా ఉంచుతుంది. ప్రొటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్ చర్యలకు తోడ్పడుతుంది. బోలన్‌లోని బ్యాక్టీరియాలను HCl నాశనం చేస్తుంది.
-
మానవునిలో ఎన్ని రకాల దంతాలున్నాయి? దంత సూత్రం రాయండి?నాలుగు రకాల దంతాలు ఉన్నాయి?
జ:
1) కుంతకాలు
2) రదనికలు
3) చర్వణకాలు
4) అగ్రచర్వణకాలు
- మనం రుచి, వాసనను ఎలా గుర్తించగలుగుతాం?
జ: ముక్కు, నాలికపై ఉన్న రసాయన గ్రాహకాలు, సంకేతాలను నాడీ ప్రచోదనాల రూపంలో మెదడుకు చేరవేస్తాయి. ఈ విధంగా మనం వాసన, రుచిని గుర్తించగలుగుతాం.
- మానవునిలో జీర్ణక్రియకు ఏయే వ్యవస్థలు తోడ్పడుతాయి?
జ:
1) హార్మోన్ వ్యవస్థ
2) నాడీ వ్యవస్థ
3) రక్త ప్రసరణ వ్యవస్థ
4) శ్వాస వ్యవస్థలు ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో సహాయపడతాయి.
- పైలోరిక్ కండరం ఎక్కడ ఉంటుంది? దాని విధి ఏమిటి?
జ: జీర్ణాశయం చిన్న పేగులోకి తెరుచుకునే భాగంలో పైలోరిక్ కండరం లేదా సంవరిణీ కండరం ఉంటుంది. అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం (కైమ్) కొద్ది కొద్దిగా ఆంత్రమూలంలోకి పంపించడానికి ఈ కండరం తోడ్పడుతుంది.
- ఆకలి సంకేతికాలు మెదడులోని ఏ భాగాన్ని చేరతాయి?
జ: జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన ఆకలి సంకేతాలు, వేగస్ నాడీ ద్వారా మెదడులోని ‘డైఎన్ సెపలాన్’కు చేరతాయి.
- ఆహారంపై లాలాజలం చర్య ఏమిటి?
జ: లాలాజలంలో ఎమైలేజ్ అనే ఎంజైమ్ పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చుతుంది.
- రాజశేఖర్ ఆకలైనప్పటికీ సరైన సమయంలో అన్నం తినలేదు. కొంత సేపటి తర్వాత అతనికి ఆకలి తీరి సాధారణ స్థితికి వచ్చాడు. కారణమేమిటో ఊహించండి?
జ: అతడు ఆకలైనప్పుడు వెంటనే అన్నం తినకపోవడం మరియు ఆకలి సమయం 45 నిమిషాలు దాటింది కూడా. జీర్ణాశయం గోడల నుంచి లెప్టిన్ ఆనే హార్మోన్ ఏర్పడింది. దీనికి తోడు కొంత HClఆమ్లం కూడా చేరింది. అందువల్ల అతనికి ఆకలి తీరి సాధారణ స్థితికి వచ్చాడు.
- పెరిస్టాలిసిస్ అపసవ్య దిశలో జరిగితే ఏం జరుగుతుంది?
జ: పెరిస్టాలిసిస్ అపసవ్య దిశలో జరిగితే ఆహారం జీర్ణాశయం నుంచి నోటి ద్వారా బయటికి వస్తుంది. ఈ స్థితిని వాంతులు అంటారు.
1/2 మార్కు ప్రశ్న జవాబులు
- జీర్ణాశయం ఆంత్ర మూలంలోనికి తెరుచుకునే చోట ఉండే సంవరిణీ కండరం?
ఎ) పైలోరిక్
బి) గాస్ట్రిక్
సి) కార్డియాక్
డి) మ్యూకస్ - ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం?
ఎ) మెడుల్లా
బి) డైఎన్‌సెఫలాన్
సి) మధ్య మెదడు
డి)ద్వారగోర్ధం - ఆకలి కోరికల సంకేతాలను మెదడుకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించే కపాల నాడీ?
ఎ) 4వ కపాలా నాడీ
బి) 5వ కపాలా నాడీ
సి) 6వ కపాలా నాడీ
డి) 10వ కపాలా నాడీ - నిబంధిత ఉద్దీపన - ప్రతిస్పందనలపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త?
ఎ) ఇవాన్ నికేల్ సన్
బి) ఇవాన్ నికోలవిచ్
సి) ఇవాన్ పావ్‌లోవ్
డి) రాబర్ట్ - పెరిస్టాలిసిస్‌కు సహకరించే కండరాలు?
ఎ) అనియంత్రిత కండరాలు
బి) దవడ కండరాలు
సి) ఉపరితల కండరాలు
డి) వలయాకార, స్తంభాకార కండరాలు - జఠర రసంలో ఉండే ఆమ్లం?
ఎ) సల్ఫ్యూరిక్ ఆమ్లం
బి) హైడ్రోక్లోరికామ్లం
సి) నత్రికామ్లం
డి) ఫాస్ఫారికామ్లం - రుచిని గ్రహించడంలో ముఖ్య పాత్ర వహించే నాడీ?
ఎ) దక్ నాడీ
బి) 5వ కపాలా నాడీ
సి) 6వ కపాలా నాడీ
డి) 10వ కపాలా నాడీ - క్లోమం, కాలేయం, చిన్న పేగు గోడల్లోని జీర్ణ రసాలను ఉత్తేజపరిచే హార్మోన్?
ఎ) ఎమైలేజ్
బి) సెక్రిటిన్
సి) కొలిసిస్టో కైనిన్
డి) బి, సి - అస్య కుహరంలో పాక్షికంగా జీర్ణం అయిన ఆహారాన్ని ఏమంటారు?
ఎ) బోలస్
బి) కైమ్
సి) కైల్
డి) నింబస్ - జీర్ణాశయంలో ఆహారం నిల్వ ఉండే సమయం?
ఎ) 4-5 గంటలు
బి) 5-6 గంటలు
సి) 2-4 గంటలు
డి) 6 -8 గంటలు - జీర్ణ వ్యవస్థలోని నాడీ మండలాన్ని దేనిగా వ్యవహరిస్తారు?
ఎ) ముందు మెదడు
బి) రెండో మెదడు
సి) మధ్య మెదడు
డి) చివరి మెదడు - స్వయం చోదిత నాడీ వ్యవస్థను నియంత్రించే మెదడులోని భాగం?
ఎ) మస్తిష్కం
బి) ద్వారగోర్ధం
సి) మజ్జాముఖం
డి) అనుమస్తిష్కం - లాలాజలం pH స్వభావం-----
- మానవుడిలో ఒక రోజుకు స్రవించబడే లాలా జలం ---
- మజ్జాముఖం ---- నాడీ వ్యవస్థలో భాగం
- వ్యతిరేక పెరిస్టాలిసిస్‌ను ---లలో గమనించొచ్చు
- పాక్షికంగా జీర్ణమైన మెత్తటి ఆహారం ----
- జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థం -----
- చిన్న పిల్లల్లో ఉండే పాల దంతాల సంఖ్య ---
- ప్రౌఢ మానవుడిలో దంతాల సంఖ్య -----
- మానవుడి దంత సూత్రం-----
- శాఖా హార జంతువుల్లో లోపించిన దంత రకం -----
- జామకాయ తిన్నప్పుడు ఉపయోగపడే దంతాలు ----
- హైడ్రోక్లోరికామ్లం నుంచి జీర్ణాశయ కుడ్యాలను కాపాడేది----
- నాలికపై రుచిని గ్రహించేది ----
గ్రూప్-ఎ |
|
గ్రూప్-బి |
26. గ్రీలిన్ |
( ) |
ఎ) లాలాజలం |
27. లెప్టీన్ |
( ) |
బి) ఆకలిని కలిగిస్తుంది |
28. టయలీన్ |
( ) |
సి) HCl |
29. సెక్రటిన్ |
( ) |
డి) జీర్ణక్రియా హార్మోన్ |
30. జఠరరసం |
( ) |
ఇ) ఆకలిని నిరోధిస్తుంది |
|
ఎఫ్) క్లోమం |
గ్రూప్-ఎ |
|
గ్రూప్-బి |
31. 5వ కపాలా నాడీ |
( ) |
ఎ) ఆకలి నియంత్రణ |
32. వేగస్ (10వ నాడీ) |
( ) |
బి) అంతర కండరాల కదలిక |
33. మజ్జాముఖం |
( ) |
సి) జీర్ణనాడీ వ్యవస్థ |
34. రెండో మెదడు |
( ) |
డి) ఆకలి సంకేతాలు |
35. ద్వార గోర్థం |
( ) |
ఇ) స్వయం చోదిత నియంత్రణ |
|
ఎఫ్) ఆహార శోషణ |
గ్రూప్-ఎ |
|
గ్రూప్-బి |
36. వలయాకార కండరాలు |
( ) |
ఎ) ఆవులు, గేదెలు |
37. ఉపరితల కండరాలు |
( ) |
బి) చిన్న పేగు ఉపరితల వైశాల్యాన్ని పెంచడం |
38.స్తంభాకార కండరాలు |
( ) |
సి) ఆహారాన్ని ఆస్యకుహరంలోకి నె ట్టడం |
39. నెమరు వేయడం |
( ) |
డి) పెరిస్టాలిక్ కదలికలు |
40. సూక్ష్మ చూషకాలు |
( ) |
ఇ) కైల్ వద్ద పేగులోకి ప్రవేశింప జేయడం |
|
ఎఫ్) దవడ కండరాల కదలికలకు సహాయం |
గ్రూప్-ఎ |
|
గ్రూప్-బి |
41. కైమ్ |
( ) |
ఎ) పూర్తిగా జీర్ణం అయిన ఆహారం |
42. కైల్ |
( ) |
బి) పెరిస్టాలిసిస్ |
43. అంగిలి |
( ) |
సి) ముక్కు |
44. ఆహార వాహిక |
( ) |
డి) నాలిక |
45. ఘ్రాణ గ్రాహకాలు |
( ) |
ఇ) పాక్షికంగా జీర్ణమైన ఆహారం |
|
ఎఫ్) ఆహార శోషణ |
అదనపు ప్రశ్నలు
46. ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం
ఎ) సెరిబ్రమ్
బి) మధ్యమెదడు
సి) డైఎన్ సెపలాన్
డి) మెడుల్లా అబ్లాంగేటా
47. మానవులు అంతర్గత దహన యంత్రం వంటివారు. ఎందుకంటే
ఎ) ఆహార పదార్థాలు జీర్ణమై శక్తి విడుదల చేయడం
బి) జీర్ణ రసాలు స్రవిస్తారు
సి) శ్వాసక్రియ ద్వారా CO2వెలువరిస్తారు
డి) జీర్ణక్రియలో చివరగా వ్యర్థాలను విసర్జిస్తారు
48. మానవునిలో ఉండే లాలాజల గ్రంధుల సంఖ్య
ఎ. 2
బి.3
సి.4
డి.5
49. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లకు కారణం
ఎ. ఒత్తిడి
బి.అధికశ్రమ
సి.ఆమ్లము
డి. అన్నీ
50. నాలికను --- కి నొక్కడం వల్ల సులభంగా రుచిని గుర్తించగలం.
51. జీర్ణక్రియలో కీలక పరిశోధన చేసిన శాస్త్రవేత్త ----
52. చిన్నపేగులోకి తెరుచుకునే భాగం పేరు ----
53. విభజన చెందే శక్తి లేని కణాలు ----
54. నెమరు వేసే జంతువుల్లో జీర్ణాశయం---- గ్రందులు కలిగి ఉంటుంది.
55. సెల్యులోజ్‌ను జీర్ణం చేసుకునే శక్తి గల జీవులు ----
56. నోటిలో సాధారణ స్థాయి ----
సమాధానాలు
1. ఎ; 2. బి ; 3.డి ; 4. సి ; 5.డి ; 6. బి; 7.డి ; 8.డి ; 9.ఎ ; 10.ఎ ; 11.బి ; 12.సి ; 13. క్షార స్వభావం ; 14. 1-1.5 లీ ;15. కేంద్ర ; 16.నెమరువేయు జంతువులలో; 17. కైమ్; 18. కైల్ ; 19. 20 ; 20. 32 ; 21. 2/2, 1/1, 2/2, 3/3; 22. రదనికలు ; 23. కొరికే దంతాలు ; 24. శ్లేష్మస్తరం; 25. రుచి గ్రాహ కాలు; 26. బి ; 27. ఇ; 28. ఎ ; 29. డి ; 30. సి; 31. బి ; 32. డి ;33. ఇ ; 34. సి; 35. ఎ; 36. సి ; 37. ఎఫ్ ; 38.డి ; 39.ఎ ; 40. బి; 41. ఇ ; 42. ఎ ; 43. డి ; 44. బి ; 45. సి; 46. సి ; 47. సి ; 48. బి ; 49.డి; 50. అంగిలి ; 51. డాక్టర్ బీమాంట్ ; 52. సంవరిణీ కండరం; 53. నాడీ కణాలు; 54. 4 ; 55. శాఖాహారులు; 56. 8-9 (క్షారయుతము).