పేద పిల్లలకు ఈ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. షెడ్యూల్‌ ఇలా..

Right to Education Act అనుసరించి ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లలో ప్రవేశాలను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఆగస్టు 9న ఒక ప్రకటనలో తెలిపారు.
పేద పిల్లలకు ఈ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. షెడ్యూల్‌ ఇలా..

ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనగా అనాధ, దివ్యాంగ బాలలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాలకు (బీసీ మైనారిటీ, ఓసీ) 6 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలోకి ఆయా పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని, లాటరీ పద్ధతిలో ఎంపికలు చేపడతామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీనవర్గాల కుటుంబాలకు వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాల కుటుంబాలకు 1.40 లక్షలు ప్రాతిపదికగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 16 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ‘https://cse.ap.gov.in/DSE’ వెబ్‌సైటు ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. ప్రవేశ దరఖాస్తుతో పాటు ఇతర సమాచారాన్ని వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు వివరించారు.

చదవండి: 7 ప్రభుత్వ స్కూళ్లకు బెస్ట్ స్కూల్ అవార్డులు

ప్రవేశాల షెడ్యూల్‌ ఇలా 

ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఆగస్టు 10

ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాటు

ఆగస్టు 16

దరఖాస్తు సమర్పణ

ఆగస్టు 16 నుంచి 26 వరకు

లాటరీ పద్ధతిలో ఎంపిక

ఆగస్టు 30

మొదటి జాబితా విడుదల

సెప్టెంబర్‌ 2

విద్యార్థుల ప్రవేశాలు

సెప్టెంబర్‌ 2 నుంచి 9 వరకు

రెండో జాబితా ప్రక్రియ

సెప్టెంబర్‌ 12 నుంచి 30 వరకు

#Tags