Anganwadi worker Awarded by PM Modi: అంగన్వాడీ వర్కర్‌కి అరుదైన అవకాశం ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు ఎందుకంటే..
అనంతపురం సెంట్రల్: నగరంలోని నేతాజీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త నిర్మలకు అరుదైన అవకాశం దక్కింది. న్యూఢిల్లీలో ఈ నెల 15న జరిగే స్వాంతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు.
Teacher Jobs Notification: భారీగా ఉపాధ్యాయ పోస్టులు: Click Here
పోషన్ అభియాన్ కార్యక్రమం అమలులో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఉత్తమ కార్యకర్తలను ఎంపిక చేశారు. అనంతపురం నుంచి నిర్మలకు ఆ అవకాశం దక్కింది. ఢిల్లీ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమెకు ఆహ్వానం అందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు, మెమొంటోను ఆమె అందుకోనున్నారు.
#Tags