Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free training for unemployed youth

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్థానిక డీఎల్‌టీసీ సహాయ సంచాలకులు ఎస్‌.ఉగాది రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here

ప్రధానమంత్రి కౌశల్‌ వికాశ్‌ యోజన కింద ఆఫీస్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సులో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్‌ ఆపైన ఉత్తీర్ణులైన వారు 15 నుంచి 30 ఏళ్ల లోపు వయసు వారు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 94934 82414 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

#Tags