Free Coaching for Group 1, 2, 3 Exams: గ్రూప్-1, 2, 3 పరీక్షలకు ఉచిత శిక్షణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించనున్న గ్రూప్స్ ఉచిత శిక్షణకు ప్రవేశ పరీక్ష ఈ నెల 10న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కవిత తెలిపారు.
స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నిర్వహించనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా వందమంది అభ్యర్థులకు సీట్లు కేటాయింస్తామన్నారు.
ఇందులో ఎస్సీలకు 75%, బీసీలకు 15%, ఎస్టీలకు 10 శాతం, సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈనెల 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.
#Tags