Three-Day Workshop : రసాయన శాస్త్రాలలో అభివృద్ధి అంశంపై మూడు రోజుల వ‌ర్క్‌షాప్‌

‘రసాయన శాస్త్రాలలో అభివృద్ధి’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్‌ గురువారం ప్రారంభమైంది.

విజయనగరం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగంలో జర్నల్‌ ఆఫ్‌ కెమికల్‌ సైన్సెస్‌ అవుట్‌ రీజ్‌ ప్రోగ్రాం ‘రసాయన శాస్త్రాలలో అభివృద్ధి’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్‌ గురువారం ప్రారంభమైంది. నవంబర్‌ 23 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో తాజా రసాయన శాస్త్ర పరిశోధనలు, విద్యా సహకారం, విద్యార్థుల పరిశోధనా సామర్థ్యాల అభివృద్ధి వంటి ముఖ్య అంశాలపై లెక్చర్స్‌ ఉంటాయి.

JEE Main 2025 Application Deadline: జేఈఈ మెయిన్స్‌కు అప్లై చేయారా? నేడే చివరి రోజు

యూనివర్సిటీ సెమినార్‌ హాల్‌లో జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో జర్నల్‌ ఆఫ్‌ కెమికల్‌ సైన్సెస్‌ ప్రధాన సంపాదకుడు ప్రొఫెసర్‌ ఎస్‌.నటరాజన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన శాస్త్రంలో తాజా పురోగతుల ప్రాధాన్యతను వివరించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

‘రసాయన శాస్త్ర అభివృద్ధి సమాజ అభివృద్ధికి మూలస్తంభం అని అన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ టీవీకట్టిమణి మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్నతమైన లక్ష్యాలను  సాధించడంలో విశ్వవిద్యాలయం పాత్రపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

కార్యక్రమాన్ని కెమిస్ట్రీ విభాగం అధ్యాపకుడు డాక్టర్‌ సురేష్‌ బాబు కె, ప్రొఫెసర్‌ ఎం.శరత్‌చంద్రబాబు, డాక్డర్‌ కిశోర్‌ పడాల నిర్వహించారు. కార్యక్రమం విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొదించడంతో పాటు, విద్యా మేధస్సుకు కొత్త మార్గాలను సృష్టించేందుకు తోడ్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ముఖ్యఅతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసన్‌, డీన్‌లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Increasing School Timings : ప‌నివేళు పెంపుతో టీచ‌ర్ల‌కు తీవ్ర ఇబ్బందులు.. ఇది లాభ‌మా? న‌ష్ట‌మా?

#Tags