Spot Admissions: ఈనెల 31న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు

ఎచ్చెర్ల క్యాంపస్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మిగులు సీట్లకు స్పాట్‌ అడ్మిషన్ల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు సీటు కోరుకునే కళాశాలకు విద్యార్థులు ఈ నెల 31వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. పాలీసెట్‌–2024 ర్యాంకు, ర్యాంకు లేని విద్యార్థులకు 10వ తరగతి అర్హతగా సీట్లు కేటాయిస్తారు.

పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు రెండు విడతలు కౌన్సెలింగ్‌ నిర్వహించగా, ఉమ్మడి జిల్లా పరిధిలో 10 కళాశాలల్లో 2699 సీట్లకు 1362 ప్రవేశాలు జరిగాయి. 1337 ఖాళీ సీట్లు ఉన్నాయి. ఐదు ప్రభుత్వ కళాశాలల్లో 752 సీట్లకు 557 సీట్లు, ఐదు ప్రైవేట్‌ కళాశాలల్లో 1947 సీట్లకు 805 ప్రవేశాలు జరిగాయి.

IIT Delhi Launches New Course: 'బిటెక్ ఇన్ డిజైన్'పేరుతో సరికొత్త కోర్సును ప్రారంభించిన 'ఐఐటీ' ఢిల్లీ

ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి ప్రవేశాలు పరిశీలిస్తే శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 295కి 275, శ్రీకాకుళం మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కశాశాలలో 99 సీట్లకు 94, ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 132 సీట్లకు 126, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 118 సీట్లకు 38, సీతంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 108 సీట్లకు 24 ప్రవేశాలు జరిగాయి. టెక్కలి, సీతంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఎక్కువ సీట్లు మిగిలిపోయాయి.

Reserve Bank of India Jobs: రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

స్పాట్‌ అడ్మిషన్లకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తించదు. ఉద యం పూట దరఖాస్తుల స్వీకరణ, మధ్యాహ్నం పూట ప్రవేశాలు నిర్వహిస్తారు. కాలేజ్‌ ఫీజు స్ట్రక్చర్‌ మేరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
 

#Tags