Students Future : పిల్ల‌ల భ‌విష్య‌త్తు కొర‌కు పాఠ‌శాలను యధావిధిగా కొన‌సాగించాలి..

తమ పిల్లలు చదువుకోవడానికి పాఠశాలను కొనసాగించాలని మండలంలోని అర్ల గిరిజన పంచాయతీ శివారు పీత్రుగెడ్డ, నీళ్లబంద గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.

రోలుగుంట: తమ పిల్లలు చదువుకోవడానికి పాఠశాలను కొనసాగించాలని మండలంలోని అర్ల గిరిజన పంచాయతీ శివారు పీత్రుగెడ్డ, నీళ్లబంద గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. రెండు గ్రామాల్లో బడిఈడు పిల్లలు 12 మంది ఉన్నారు. వీరంతా చదువుకోవాలంటే పది కిలోమీటర్లు దూరాన అర్ల గ్రామానికి వెళ్లాలి. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో నడుచుకుని అనేక ఇక్కట్లు ఎదుర్కోంటూ పాఠశాలకు వెళ్లి వచ్చే వరకూ తల్లిదండ్రులు ఆందోళనగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనేది. ఈ సమస్యను గతేడాది లోసింగి గ్రామానికి వచ్చిన అప్పటి వైఎస్సార్‌సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మొరపెట్టుకోగా, ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటు చేశారు.

NIT Graduation Day : ఏపీ నిట్ ఆరో స్నాత‌కోత్స‌వం వేడుక‌లు.. విద్యార్థుల‌కు ప్రోత్స‌హం..

ఇంతలో ప్రభుత్వం మారడంతో ఈ విద్యా సంవత్సరం లోసింగిలో పాఠశాల తెరుచుకోలేదు. తమ పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని కలెక్టర్‌తోపాటు ప్రజాప్రతినిధులను గిరిజనులు కోరుతున్నారు. ఉపాధ్యాయులు, వారి సిబ్బంది వచ్చిపోయే వీలుగా శ్రమదానంతో రోడ్డు నిర్మించుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు కిలో రాజు, మర్రి సన్యాసిరావు తదితరులు తెలిపారు. దీనిపై ఎంఈవో–2ని సంప్రదించగా వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

AP Model Schools : వెలుగులోకి వ‌చ్చిన ఏపీ మోడ‌ల్ స్కూళ్ల ప‌లు స‌మ‌స్య‌లు.. విద్యార్థుల‌కు ఇబ్బందులు..

#Tags