RBI Summer Internship Program : యువతకు శుభవార్థ.. సమ్మర్ ఇంటర్నషిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించిన ఆర్‌బీఐ.. అర్హులు వీరే!
తిరుపతి సిటీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువతక శుభవార్త చెప్పింది. ఆర్‌బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను ప్రకటించింది. ఇందులో ఎంపికైన యువతకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనుంది. నెలకు రూ.20 వేలు ఉచితంగా స్టైఫండ్ అందించనుంది. ఈ ప్రోగ్రాంకు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను అర్హులుగా ప్రకటించింది.
AP Contract Lecturers : కాంట్రాక్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం ఝులక్.. క్రమబద్దీకరణ ఎప్పుడు!
ఇందులో ప్రధానంగా మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, లా, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు అభ్యసిస్తున్న వారి ని అర్హులుగా ప్రకటించింది. ఆర్‌బీఐ ప్రతి ఏడాదీ 125 మంది విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్ షిప్ కింద శిక్షణ ఇస్తూ స్టైఫండ్ అందింస్తోంది. అర్హులైన విద్యార్థులు డిసెంబర్ 15వ తేదీలోపు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)