JNTU Anantapur: పీహెచ్‌డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురంలో ఇండస్ట్రియల్‌, ఎగ్జిక్యూటివ్‌ కోటాలో పార్ట్‌టైం, ఫుల్‌టైం పీహెచ్‌డీ కోర్సులు అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు వీసీ ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇండస్ట్రీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌, అర్‌ అండ్‌ డీ (రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) సంస్థల్లో పనిచేసే శాస్త్రవేత్తలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు పీహెచ్‌డీ అడ్మిషన్‌ పొందవచ్చు. సంబంధిత పీజీలో 55 శాతం మార్కులు లేదా 6.0 సీజీపీఏ సాధించిన వారు అర్హులు. ఇద్దరు గైడ్లు ఉంటారు. పనిచేస్తున్న సంస్థలో ఒక గైడ్‌, యూనివర్సిటీ తరఫున ఒక గైడ్‌ ఉంటారు. దరఖాస్తులు సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఈసీఈ, కంప్యూటర్‌ సైన్స్‌, కెమికల్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, మేనేజ్‌మెంట్‌, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్‌ సైన్సెస్‌, ఇంగ్లిష్‌, ఫుడ్‌ టెక్నాలజీ రంగాల్లో పీహెచ్‌డీ చేయడానికి అవకాశం కల్పించారు. జేఎన్‌టీయూ అనంతపురం కానిస్టిట్యూట్‌ కళాశాలలే కాకుండా యూనివర్సిటీ గుర్తించిన 14 పరిశోధన కేంద్రాల్లో దేనిలోనైనా పీహెచ్‌డీ చేయవచ్చు. అభ్యర్థులు రూ.1500 డిమాండ్‌ డ్రాఫ్ట్‌తో దరఖాస్తుకు సంబంధిత సర్టిఫికెట్లను జత చేస్తూ ఈ నెల 16వ తేదీలోపు యూనివర్సిటీకి చేరేటట్లు పంపాలి.

చ‌ద‌వండి: Free Coaching for Group Exams: గ్రూప్‌ 1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ

రీసెర్చ్‌ కేంద్రాలు ఇవే..
జేఎన్‌టీయూ అనంతపురం కానిస్టిట్యూట్‌ కళాశాలల ( జేఎన్‌టీయూ అనంతపురం, కలికిరి, పులివెందుల, ఓటీపీఆర్‌ఐ)తో పాటు 14 పరిశోధన కేంద్రాల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. శాంతిరాం ఇంజినీరింగ్‌ కళాశాల (నంద్యాల), శ్రీ వెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (అటానమస్‌) (చిత్తూరు), శ్రీ వెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (అటానమస్‌) తిరుపతి, వేము ఇనిస్టిట్యూట్‌ (పి.కొత్తకోట, చిత్తూరు), శ్రీనివాస మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (చిత్తూరు), శ్రీ వెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ (చిత్తూరు), కేఎస్‌ఆర్‌ఎం (అటానమస్‌) కడప, శ్రీ పద్మావతి స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ (తిరుపతి), అన్నమాచార్య (అటానమస్‌) రాజంపేట, జి.పుల్లారెడ్డి (అటానమస్‌) కర్నూలు, ఆర్‌జీఎం (అటానమస్‌) నంద్యాల, రైపర్‌ అనంతపురం, సెవన్‌ హిల్స్‌ ఫార్మసీ తిరుపతి.

చ‌ద‌వండి: Free Coaching for Group 2: ఉచితంగా గ్రూప్‌–2 కోచింగ్‌.. చివ‌రి తేదీ ఇదే..

అంతరం తగ్గాలి
రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలుగా ఉన్న వారు, ఇండస్ట్రీ అనుభవం ఉన్నవారికి పరిశోధన పట్ల ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేయడానికి అవకాశం కల్పిస్తాం. దీంతో పరిశ్రమ– కళాశాల మధ్య అంతరం తగ్గి.. బంధం బలపడుతుంది. పరిశ్రమలకు తగ్గట్టుగా పరిశోధన చేయడానికి కళాశాల దోహదపడుతుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కళాశాలలో పరిశోధన వాతావరణం మెరుగుపడుతుంది. దీంతో ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తున్నాం.
– ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్‌టీయూ అనంతపురం

#Tags