Overseas Scholarship : మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య‌కు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌.. ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మైనారిటీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాల్లోని విదేశీ యూనివర్శిటీల్లో తెలంగాణకు చెందిన మైనారిటీ విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చదివేందుకు అవకాశం ఉంటుంది.
స్కాలర్‌షిప్‌ వివరాలు
➤     అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.
➤     స్కాలర్‌షిప్‌ గ్రాంట్‌ రూ.20లక్షలు వరకు.
➤     ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హులు.
➤     కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, జీఆర్‌ఈ/జీమ్యాట్, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ స్కోర్‌ ఉండాలి.
ముఖ్య సమాచారం
➤     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
➤     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.08.2024.
➤     వెబ్‌సైట్‌: https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.do

INSPIRE Manak Awards : ఇన్‌స్పైర్ మ‌న‌క్ 2025 అవార్డ్‌ల‌కు ద‌ర‌ఖాస్తులు..

#Tags