Best Available Schools: బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు దరఖాస్తుల ఆహ్వానం

నిర్మల్‌ఖిల్లా: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల ఎంపికకు జిల్లాలోని ప్రైవేట్‌ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్‌ కులాల సంక్షేమ అధికారి రాజేశ్వర్‌గౌడ్‌ తెలిపారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకంలో రెసిడెన్షియల్‌ విద్యార్థులకు ట్యూషన్‌, హాస్టల్‌ వసతి రెండు జతల దుస్తులు పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలకు ప్రతీ విద్యార్థికి రూ.42 వేలు చెల్లిస్తుందని తెలిపారు. డేస్కాలర్‌ విద్యార్థికి రూ.28 వేలు చెల్లిస్తుందన్నారు. దరఖాస్తుల కోసం జిల్లా షెడ్యూల్‌ కులాల సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈనెల 20 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. వివరాలకు 8309835938 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
 

#Tags