ఇంగ్లిష్‌ మీడియంతో మంచి భవిష్యత్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం మంచి పరిణామమని, దీనివల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్‌ ఉంటుందని సాంఘిక సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ కల్యాణి అన్నారు. బుధవారం జెడ్పీలోని సీసీఓ చాంబర్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థులకు నూతనంగా సీఎం కేసీఆర్‌ విదేశీ విద్యాపథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.20 లక్షల వరకు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కల్పించే ఓవర్‌సీస్‌ విద్యపై అవగాహన కల్పించాలని వివిధ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెట్టాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిచడంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్‌షిప్‌ జాప్యం లేకుండా చూడాలన్నారు. త్వరలో విద్యార్థుల పరీక్షలు పూర్తయిపోతాయని సెలవుల్లో హాస్టళ్లలో ఏమైన మరమ్మతులు ఉంటే సరిచేయాలన్నారు. కార్యక్రమంలో మిడ్జిల్‌ జెడ్పీటీసీ శశిరేఖ, జెడ్పీ సీఈఓ జ్యోతి, డిప్యూటీ సీఈఓ మొగులప్ప, బీసీ సంక్షేమాధికారి ఇందిరా, మైనార్టీ సంక్షేమాధికారి టైటస్‌పాల్‌, ఎస్సీ అభివృద్ధిశాఖ డీడీ పాండు, ఎస్టీ సంక్షేమాధికారి చత్రు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

#Tags