Exams Cancelled Due to Heavy Rain 2024 : భారీ వర్షాలు.. పరీక్షలు రద్దు..!
వాతావరణ శాఖ ముంబై, పూనేకి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో నేడు జరగాల్సిన 10, 12వ తరగతి Supplementary పరీక్షలు Maharashtra State Board of Secondary and Higher Secondary Education(MSBSHSE) వాయిదా వేసింది. అలాగే మహరాష్ట్రలోని వివిధ యూనివర్సిటీల్లో జరగనున్న పరీక్షలను కూడా వాయిదా వేశారు.
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..
దక్షిణ కర్నాటక, కోస్తా కర్నాటకకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కేరళలోని కొట్టాయం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. కొంకణ్-గోవా, గుజరాత్, ఒడిశాలో 12 సెంటీమీటర్లకు మించి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. పంజాబ్, రాజస్తాన్, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బలమైన తుపాను ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
చదవండి: Telangana 3days School Holidays News: తెలంగాణలో మరో 3 రోజులు స్కూళ్లకు సెలవు ఎందుకంటే..?
అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా..
తెలుగు రాష్ట్రాలను వానలు వరదలు ముంచెత్తుతున్నాయి. మరో రెండు రోజులు పాటు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు పడనున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళఖాతంలో అయితే ఒకదాని తరువాత ఒక అల్పపీడనం ఏర్పడుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
☛ School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే..