DSC Free Coaching : డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు గడువు పెంపు

ఒంగోలు సెంట్రల్‌: జిల్లాలోని గిరిజనులకు డీఎస్సీ ఉచిత కోచింగ్‌ ఇవ్వటానికి దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించినట్లు గిరిజన సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమాధికారి జగన్నాథరావు వెల్లడించారు. జిల్లాలోని గిరిజనులు డిగ్రీ, బీఈడీ, ఇంటర్‌, డీఈడీ, టెట్‌ పాసైన వారిని మెరిట్‌ ఆధారంగా డీఎస్సీ కోచింగ్‌కు అర్హులుగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.

ITI Admissions 2024: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇదే చివరి తేది

జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతీ యువకులు ఆసక్తి కల వారు దరఖాస్తుతో పాటు పదో తరగతి, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, బీఈడీ, ఇంటర్‌, డీఈడీ, టెట్‌ పాసైన ఉత్తీర్ణత సర్టిఫికెట్స్‌, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, రేషన్‌ జెరాక్స్‌ కాపీలు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో మీ దరఖాస్తును సమర్పించాలని కోరారు. వంద మంది వరకు కోచింగ్‌ ఇవ్వటానికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అర్హత గల అభ్యర్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

#Tags