PM Shri Scheme : పాఠ‌శాల‌ల అభివృద్ది ప‌నులు వేగ‌వంతం.. క‌లెక్ట‌ర్ ఆదేశం!

పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సూచించారు.

ఒంగోలు అర్బన్‌: పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సూచించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షించి, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

పీఎం శ్రీ పథకం కింద చేపడుతున్న పనులు, నిధులు తదితర వివరాలను కలెక్టర్‌కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొదటి దశలో చేపట్టిన పనులను అక్టోబర్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎంలు, ఎంఈఓలు సమన్వయంతో పనులను పర్యవేక్షించాలని సూచించారు.

Contract Teacher Jobs : కాన్ట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ఉపాధ్యాయ పోస్టులు.. ఇంట‌ర్య్వూ తేదీ!

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఈఓ సుభద్ర, డీవైఈఓ సామా సుబ్బారావు, సమగ్ర శిక్ష డీఈ నమ్మయ్య, ఏపీఓ మాధవీలత, డీసీడీఓ ప్రమోద, ఏఎంఓ రమేష్‌, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags