Scholarship Scheme : దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన – ఫిలాటలి స్కాలర్‌షిప్ పథకాన్ని స‌ద్వినియోగం చేసుకోండి..

‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన’ – ఫిలాటలీ స్కాలర్‌షిప్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ రాజేష్‌ పేర్కొన్నారు.

కడప: తపాలా బిళ్లల సేకరణ (ఫిలాటలి) అభిరుచిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత తపాలా శాఖ ద్వారా ప్రవేశపెట్టిన ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన’ – ఫిలాటలీ స్కాలర్‌షిప్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ రాజేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని కడప పోస్టల్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Teachers Day Awards : జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ ర‌త్న‌ పుర‌స్కారాలు.. ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ..

ఏటా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూనే ఫిలాటలిని అభిరుచిగా కొనసాగించే 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు సర్కిల్‌ స్థాయిలో ఫిలాటలి ప్రాజెక్ట్‌, ఫిలాటలి క్విజ్‌/పరీక్ష ఆధారంగా స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే 2024–25 సంవత్సరానికి దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన – ఫిలాటలి స్కాలర్‌షిప్‌ పథకం నోటిఫికేషన్‌ను భారత తపాలా శాఖ విడుదల చేసిందన్నారు. అభ్యర్థి 2023–24లో జరిగిన చివరి పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌/గ్రేడ్‌ పాయింట్‌లు సాధించి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టల్‌ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని వివరించారు.

Job Interviews: ఈనెల 28న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు

#Tags