BSc Nursing Course: ఆర్మీలో నర్సింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. వీళ్లు మాత్రమే అర్హులు

ఇండియన్‌ ఆర్మీ దేశవ్యాప్తంగా ఉన్న ఐదు కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఏఎఫ్‌ఎంఎస్‌)లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్‌) కోర్సులో ప్రవేశానికి  అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

కోర్సు: బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సు
మొత్తం సీట్లు: 220

అర్హత: అవివాహిత/విడాకులు తీసుకున్న/చట్టబద్ధంగా విడిపోయిన/వితంతువులైన మహిళా అభ్యర్థులు అర్హులు.కనీసం 50 శాతం మార్కులు సీనియర్‌ సెకండరీ పరీక్ష 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,ఇంగ్లిష్‌). నీట్‌(యూజీ)2024లో అర్హత సాధించి ఉండాలి. కనిష్ట ఎత్తు 152 సెం.మీ. కలిగి ఉండాలి.

UGC Chairman: 'అలాంటి వాళ్లు పీహెచ్‌డీ చేయకండి'.. ‌యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌కుమార్‌

వయస్సు: 01.10.1999 నుంచి 30.09.2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.
ఎంపిక విధానం: నీట్‌ 2024 స్కోరు, రాతపరీక్ష,ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: ఆగస్టు 07, 2024

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in

#Tags