Teachers Day Awards : జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ ర‌త్న‌ పుర‌స్కారాలు.. ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ..

అనంతపురం: భారతీయ సంస్కృతిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న గురువుల కృషిని గుర్తిస్తూ డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేర్వేరుగా ఉపాధ్యాయ రత్న పురస్కారాలను ‘సర్వేజనా సుఖినోభవంతు’ సాంస్కృతిక, సాహిత్య సంస్థ అందజేయనుంది. ఈ మెర‌కు సంస్థ వ్యవస్థాపకులు ఈఎస్‌ఎస్‌ నారాయణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Job Interviews: ఈనెల 28న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు

కేవలం విద్యారంగమే కాకుండా వివిధ రంగాలలో గురువులుగా రాణిస్తున్న వారు అవార్డులకు అర్హులు. అర్హులైన వారు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులను ‘సర్వేజనా సుఖినోభవంతు, డోర్‌నం. 1–20–164, గోకుల్‌నగర్‌, వెంకటాపురం, సికింద్రాబాద్‌ –15’ చిరునామాకు చేరేలా పంపాలి. ఎంపికైన వారికి వచ్చే నెల 8న హైదరాబాదులో సత్కరించి, పురస్కారాలు అందజేస్తారు. పూర్తి వివరాలకు 96523 47207లో సంప్రదించవచ్చు.

Maternity Leave: మహిళా ఉద్యోగులకు స్పీడ్‌ బ్రేకర్లుగా మారుతున్న ప్రసూతి సెలవులు!!

#Tags