NMMS Exam: ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్)కు దరఖాస్తు చేసుకునేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 15 చివరి తేదీగా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో డిసెంబర్ 3న పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్‌సైట్ బిఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ లేదా డిఈఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
చదవండి: Prof Michael R Kramer: ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం
#Tags