AP Model Schools:ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
AP Model Schools:ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం : జిల్లాలోని 15 ఏపీ మోడల్‌ స్కూళ్ల (ఏపీఎంఎస్‌)ల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు డీఈఓ బి.వరలక్ష్మి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుంది. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈ నెల 28 నుంచి మే 22వ తేదీలోపు https://apms.apcfss.inhttps://cse.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.150 చొప్పన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పదో తరగతి మార్కుల మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనల మేరకు సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాలకు ఆయా మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ఎంఈఓలను సంప్రదించవచ్చు.

#Tags