Andhra Pradesh: ఉపాధి కల్పనలో ఏపీ నంబర్‌ వన్‌

బీచ్‌రోడ్డు: ఉపాధి కల్పనలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి, రాష్ట్ర ప్రభుత్వ స్కిల్స్‌, శిక్షణ సలహాదారు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ (సీడాప్‌), దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన, సాగరమాలలో శిక్షణ పొందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురువారం వీఎంఆర్డీఏ చిల్ట్రన్‌ ఏరీనాలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీడాప్‌ ద్వారా గడిచిన నాలుగేళ్లలో 64 వేల మందికి శిక్షణ ఇస్తే.. వారిలో 46 వేల మంది ఉపాధి పొందినట్లు చెప్పా రు. నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంలో సీడాప్‌ దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. శిక్షణ ఇవ్వడంలో మూడో స్థానంలో నిల వడం హర్షణీయన్నారు. దూరదృష్టితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని.. ఆయన ఆలోచనలకు తగిన విధంగా శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పి.అజయ్‌రెడ్డి మాట్లాడుతూ విద్య పూర్తి చేసి నైపుణ్యం కోసం వచ్చిన వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే బాధ్యతను సీడాప్‌ తీసుకుంటుందని హామీ ఇచ్చా రు. సీడాప్‌ చైర్మన్‌ ఎస్‌.శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడు తూ శిక్షణ పూర్తి చేసిన వారు.. తమ ప్రాంతాల్లోని ని రుద్యోగ యువతకు ఇక్కడ అందిస్తున్న శిక్షణ గురించి తెలియజేయాలన్నారు. సీడాప్‌ సీఈవో ఎం.కె.వి.శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనలతో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రస్తుతం శిక్షణ పొందుతున్న విద్యార్థులు డ్యాన్స్‌లు, పాటలు, స్కిట్లతో అలరించారు. ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్‌, వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి రాజీవ్‌ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

హ్యాపీ బర్త్‌ డే సీఎం సర్‌
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేయర్‌ భారీ కేక్‌ను కట్‌ చేసి అతిథులకు పంచిపెట్టారు. చిల్ట్రన్‌ ఎరీనా ప్రాంగణం ‘హ్యాపీ బర్త్‌ డే సీఎం సర్‌’ అనే నినాదాలతో మార్మోగింది.
 

#Tags