Poverty: 2022–23లో ఏపీలో తగ్గిన పేదరికం

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2022–23 నాటికి పేదరికం నిష్పత్తిని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక విశ్లేషించింది.

గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో పేదరికం 7.10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.62 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఐదు శాతం కన్నా దిగువున ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 4.40 శాతం ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా పేదరికం తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. 

దీనికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను నిర్మించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమని స్పష్టం చేసింది. వీటి ద్వారా గ్రామీణ జీవనోపాధిని గణ­నీయంగా మెరుగు పరచిందని నివేదిక తెలి­పిం­ది. 



ప్రభుత్వాలు అమలు చేసిన కార్య­క్రమాలతో పేదరికం తగ్గడంతో పాటు గ్రామీ­ణ, పట్టణ పేదల జీవనోపాధి మెరుగుపడిందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే జాతీయ స్థాయిని మించి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో పేదరికం ఉందని పేర్కొంది.

#Tags