Tenth Exams 2024 : పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఫలితాలకు కార్యాచరణ
Sakshi Education
Tenth Exams 2024 : పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఫలితాలకు కార్యాచరణ
చౌటుప్పల్ : పదవ తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని డీఈఓ నారాయణరెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు.
Also Read : Tenth Class Telangana Telugu Study Material
మధ్యాహ్న భోజనాన్ని, వంటల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తరగతుల్లో ఏ రోజు ఏ సబ్జెక్ట్ బోధించాలనే విషయాన్ని ఇప్పటికే నిర్ణయించామన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట ఎంఈఓ వి.శ్రీధర్, ఎస్‌ఎంసీ చైర్మన్ కై రంకొండ అశోక్, ప్రధానోపాధ్యాయుడు ఎస్.దుర్గయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Published date : 24 Jan 2024 03:37PM