UI Greenmetric Ranking 2023: కేయూకు మొదటి స్థానం
కేయూ క్యాంపస్: ఇండోనేషియా జకర్తాలోని యూఐగ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్(2023)లో కాకతీయ యూనివర్సిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య టి.శ్రీనివాస్‌రావు సోమవారం తెలిపారు. దేశంలో 29వ స్థానం, ప్రపంచంలో 600ల స్థానం కై వసం చేసుకుందని చెప్పారు. ఇందుకు సంబఽంఽధించిన సర్టిఫికెట్ యూఐగ్రీన్ మెట్రిక్ చైర్‌పర్సన్ నుంచి మేయిల్ ద్వారా కేయూకు సమాచారం అందిందని పేర్కొన్నారు. పర్యావరణ, సుస్తిరత, బాధ్యతాయుతమైన క్యాంపస్ నిర్వహణపై దృష్టిసారించి చేసిన ప్రయత్నాలకు ఇది నిదర్శనమన్నారు. హరిత కార్యక్రమాలు, స్థిరమైన అభ్యాసాలను ప్రోత్సహించటంలో ముందున్నట్లు వివరించారు. ఈ ర్యాంకింగ్ రావటంపై కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కేయూ న్యాక్ ఏప్లస్ గ్రేడ్ సాధించిందని, తాజాగా యూఐమెట్రిక్స్ ర్యాంకింగ్ కూడా వచ్చిందని, యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేయడానికి అందరి సహకారంతో ముందుకెళ్తామన్నారు.
చదవండి: Mega Job Mela: రేపు వైఎస్సార్ మెగా జాబ్ మేళా.. 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు