High Court: ఇక స్కూళ్లు తెరవండి.. పరీక్షలకు
Sakshi Education
బెంగళూరు:ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యాసంస్థలు తెరవాలని హైకోర్టు ఆదేశించింది. కర్ణాటకలో హిజాబ్– కండువా వివాదం కారణంగా విద్యా సంస్థల మూసివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తుది తీర్పు వచ్చే వరకూ విద్యార్థులు హిజాబ్-కండువాల ప్రస్తావన తేవొద్దని తెలిపింది.
పరీక్షలు రెండు నెలలే..
హిజాబ్ రగడపై దాఖలైన పిటిషన్‌ను సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నేతృత్వంలోని హైకోర్టు విచారించింది. ఫిబ్రవరి 10వ తేదీన విచారించిన ధర్మాసనం.. తుది తీర్పును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకూ హిజాబ్- కండువాల ప్రస్తావనకు దూరంగా ఉండాలని పేర్కొంది. కాగా, వివాదంపై మంగళ, బుధవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణలో పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
Holidays: మూడు రోజుల పాటు స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. కారణం ఇదే
Published date : 10 Feb 2022 06:57PM