Education: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
శుక్రవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని భువనవిజయం ఆడిటోరియంలో ‘ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి– నినాదం’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాకే జమ చేసే విధానం (డిబీటీ)తో రూ.2.49 లక్షల కోట్లు అట్టడుగు వర్గాల వారికి చేరాయన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా విధానాలు అమలు చేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలిచిందని ప్రశంసించారు. కేవలం 56 నెలల్లోనే ఒక్క విద్యారంగంపైనే రూ.80 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. కార్పొరేట్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడేలా తీర్చిదిద్దారన్నారు. నాడు–నేడు కింద 50,703 పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించారని, రూ.17,805 కోట్లు ఖర్చు చేశారన్నారు. వైద్య రంగంలోనూ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. 17 కొత్త మెడికల్ కాలేజీలకు ప్రాణం పోశారని, 50 వేలకు పైగా ఉద్యోగాలిచ్చారన్నారు. 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు గ్రామ ఆరోగ్యానికి బాటలు వేశాయని, వ్యవసాయ రంగంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ బి. సత్యనారాయణ, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నరసింహన్, ప్రొఫెసర్ వెంకటనాయుడు, ప్రొఫెసర్ ఆంజనేయులు, డాక్టర్ వి. మాధవి, డాక్టర్ చంద్రమౌళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: AP DSC Notification 2024: ఈ జిల్లాలో భర్తీ కానున్న 712 ఉపాధ్యాయ పోస్టులు..
Tags
- Education
- revolutionary changes
- Revolutionary Changes in Education
- AP CM YS Jagan Mohan Reddy
- Central University of Tamil Nadu
- Central University of Hyderabad
- Sri Krishna Devaraya University
- Integrated Development of Andhra Pradesh
- Students
- Education News
- andhra pradesh news
- Education in Andhra Pradesh