Skip to main content

Free Tailoring Training: త్వరలో ఉచిత కుట్టుశిక్షణ

Training Program  free tailoring training in telangana    Narayankhed Employment    Rural Development Collaboration

నారాయణఖేడ్‌: ఉపాధిహామీ పథకంలో 2018 నుంచి 2013వరకు 100 పనిదినాలు పూర్తిచేసుకున్న మహిళలకు గ్రామీణాభివృద్ధి సంస్థ, ఎస్‌బీఐ, ఆర్‌ఎస్‌ఈటీటీటీఐ సహకారంతో ఉచిత కుట్టుశిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మహిళా సమాఖ్య మేనేజర్‌ జ్యోతి, ఐకేపీ ఏపీఎం టిక్యానాయక్‌ తెలిపారు. ఐకేపీ కార్యాలయంలో గురువారం శిక్షణకు సంబంధించి స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. 60 మంది మహిళలు వస్తే అతిత్వరలో శిక్షణను ప్రారంభిస్తామని, నెలరోజుల పాటు రోజూ రూ.272 చొప్పున నగదు ఇవ్వడంతోపాటు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. డీపీఎం నాబార్డు సహకారంతో త్వరలో ఎంబ్రాయిడరీలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఐకేపీ జేఆర్పీలు సురేఖ, వెంకట్‌రావు, సీసీలు రాజు, శివ్‌రాజ్‌, వెంకట్‌, అశోక్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Published date : 30 Dec 2023 11:11AM

Photo Stories